ఎస్‌ఎస్‌సీ గెలుపు | ssc truimph | Sakshi
Sakshi News home page

ఎస్‌ఎస్‌సీ గెలుపు

Sep 17 2013 2:00 AM | Updated on Sep 1 2017 10:46 PM

పోలో సీజన్-2013లో సునీంద్ర స్పోర్ట్స్ కార్పొరేషన్ (ఎస్‌ఎస్‌సీ) జట్టు జోరు కొనసాగుతోంది. ఇప్పటికే ప్రిన్స్ ఆఫ్ బేరార్ కప్, సీఎం కప్‌లను సొంతం చేసుకున్న ఎస్‌ఎస్‌సీ, బైసన్ ట్రోఫీలోనూ శుభారంభం చేసింది


 సాక్షి, హైదరాబాద్: పోలో సీజన్-2013లో సునీంద్ర స్పోర్ట్స్ కార్పొరేషన్ (ఎస్‌ఎస్‌సీ) జట్టు జోరు కొనసాగుతోంది. ఇప్పటికే ప్రిన్స్ ఆఫ్ బేరార్ కప్, సీఎం కప్‌లను సొంతం చేసుకున్న ఎస్‌ఎస్‌సీ, బైసన్ ట్రోఫీలోనూ శుభారంభం చేసింది. సికింద్రాబాద్‌లోని బైసన్ పోలో గ్రౌండ్స్‌లో సోమవారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో ఎస్‌ఎస్‌సీ (బ్లాక్)  11-2 గోల్స్ తేడాతో సీ డ్రాగన్స్‌ను చిత్తు చేసింది. ఎస్‌ఎస్‌సీ తరఫున ధ్రువ్‌పాల్ గొదారా ఒక్కడే 9 గోల్స్ చేయడం విశేషం. మొదటి చకర్‌లో 3, రెండో చకర్‌లో 4 గోల్స్ చేసిన ధ్రువ్ మూడో చకర్‌లో మరో 2 గోల్స్ నమోదు చేశాడు.
 
  సూర్యబహదూర్, పాంచల్ చెరో గోల్ సాధించారు. నెగెటివ్ హ్యండిక్యాప్‌తో ప్రారంభించిన డ్రాగన్స్ జట్టు తరఫున ఎవరూ గోల్ చేయలేదు. కేవలం అడ్వాంటేజ్ రూపంలో ఆ జట్టు ఖాతాలో రెండు గోల్స్ నమోదయ్యాయి. మరో మ్యాచ్‌లో ఫోర్సెస్ 5-4 తేడాతో డీపీఆర్‌సీపై విజయం సాధించింది. ఫోర్సెస్ తరఫున విజయ్ సింగ్ 3, రాంసింగ్ 2 గోల్స్ చేయగా...డీపీఆర్‌సీ తరఫున ధనంజయ్ 2, సలీమ్, అబ్దుల్లా చెరో గోల్ చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement