పాకిస్తాన్ విజయలక్ష్యం 151

పాకిస్తాన్ విజయలక్ష్యం 151 - Sakshi


మిర్పూర్: ఆసియాకప్లో భాగంగా శ్రీలంకతో జరుగుతున్న చివరి లీగ్ మ్యాచ్లో పాకిస్తాన్ 151 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ గెలిచిన పాకిస్తాన్ తొలుత శ్రీలంక బ్యాటింగ్ చేయాల్సిందిగా ఆహ్వానించింది. దీంతో బ్యాటింగ్ చేపట్టిన లంకేయులకు శుభారంభం లభించింది.   ఓపెనర్లు చండిమాల్(58; 49 బంతుల్లో 7ఫోర్లు,1 సిక్స్), దిల్షాన్(75;56 బంతుల్లో 10 ఫోర్లు, 1సిక్స్)లు రాణించి లంక గౌరవప్రదమైన స్కోరు చేయడంలో సహకరించారు.


 


అయితే జట్టు స్కోరు 110 పరుగుల వద్ద చండిమాల్  వికెట్ ను  కోల్పోయిన లంకేయులు.. మరో ఏడు పరుగుల వ్యవధిలో జయసూరియా(4)ను రెండో  వికెట్ నష్టపోయారు. అనంతరం కపుగదెరా(2), షనకా(0) వికెట్లను లంక వెనువెంటనే కోల్పోయింది. ఈ క్రమంలోనే ఈ టోర్నీలో తొలిసారి ఆకట్టుకున్న దిల్షాన్ హాఫ్ సెంచరీ మార్కును చేరాడు.  ఒకవైపు తనదైన శైలిలో బ్యాటింగ్ చేస్తూనే చివరి వరకూ క్రీజ్లో నిలిచి బాధ్యాతయుత ఇన్నింగ్స్ ఆడాడు. దీంతో లంక నిర్ణీత ఓవర్లో నాలుగు వికెట్లు కోల్పోయి 150 పరుగులు చేసింది.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top