శ్రీలంక ఫీల్డింగ్.. భారత్ బ్యాటింగ్ | Sakshi
Sakshi News home page

శ్రీలంక ఫీల్డింగ్.. భారత్ బ్యాటింగ్

Published Tue, Feb 9 2016 8:19 AM

శ్రీలంక ఫీల్డింగ్.. భారత్ బ్యాటింగ్

మిర్పూర్: అండర్-19 క్రికెట్ ప్రపంచకప్ లో భాగంగా టు స్థానిక షేరే బంగ్లా జాతీయ స్టేడియంలో మంగళవారం జరుగుతున్న సెమీఫైనల్లో భారత్, శ్రీలంక జట్లు తలపడుతున్నాయి. టాస్ గెలిచిన శ్రీలంక ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో యువభారత్ ముందుగా బ్యాటింగ్ కు దిగనుంది.

సిరీస్ ఆరంభం నుంచి జోరుమీదున్న భారత్ శ్రీలంకను ఓడించి ఫైనల్ చేరాలని పట్టుదలగా ఉన్నారు. ప్రపంచకప్ కల సాకారం చేసుకునేందుకు లంకను కచ్చితంగా జయించాలనే ధ్యేయంతో బరిలోకి దిగుతున్నారు. అత్యుత్తమ ఆటతీరు చూపి శ్రీలంకను ఓడించాలని ఉత్సాహంగా ఉన్నారు. క్వార్టర్స్‌లో ఇంగ్లండ్‌పై స్ఫూర్తిదాయక విజయాన్ని అందుకుని మంచి ఊపు మీదున్న యువశ్రీలంక కూడా సత్తా చాటాలని భావిస్తోంది.

Advertisement
 
Advertisement
 
Advertisement