
ముంబై: బీసీసీఐ విధించిన జీవితకాల నిషేధాన్ని కేరళ హైకోర్టు సమర్థించడంతో డీలా పడిన పేసర్ శ్రీశాంత్... తన కెరీర్‌ను మరో దేశం తరఫున కొనసాగించాలని ఆలోచిస్తున్నాడు. ‘నా మీద నిషేధం బీసీసీఐ విధించిందే కానీ ఐసీసీ కాదు. భారత్‌లో ఆడలేకపోతే వేరే ఏ దేశం నుంచైనా ఆడగలను.
.బీసీసీఐ అనేది ప్రైవేట్ సంస్థ మాత్రమే. అది భారత జట్టుకు సంబంధించినది. నేను వేరే దేశం తరఫున ఆడితే వీరికి సంబంధం ఉండదు’ అని శ్రీశాంత్ స్పష్టం చేశాడు. మరోవైపు బీసీసీఐ కార్యదర్శి అమితాబ్ చౌదరి స్పందిస్తూ ‘ఐసీసీ నిబంధనల ప్రకారం ఒక దేశం ఏ ఆటగాడిపైనైనా నిషేధం విధిస్తే అతను ఏ దేశం తరఫున కూడా ఆడలేడు. బీసీసీఐకి న్యాయపరమైన అంశాలపై పూర్తి అవగాహన ఉంది’ అని వివరించారు.