దక్షిణాఫ్రికాదే సిరీస్ | South Africa women cricket team won the series | Sakshi
Sakshi News home page

దక్షిణాఫ్రికాదే సిరీస్

Nov 29 2014 12:43 AM | Updated on Sep 2 2017 5:17 PM

భారత మహిళల క్రికెట్ జట్టుతో జరిగిన మూడు వన్డేల సిరీస్‌ను దక్షిణాఫ్రికా జట్టు 2-1 తేడాతో దక్కించుకుంది.

2-1తో భారత్ మహిళలపై విజయం
 
 బెంగళూరు: భారత మహిళల క్రికెట్ జట్టుతో జరిగిన మూడు వన్డేల సిరీస్‌ను దక్షిణాఫ్రికా జట్టు 2-1 తేడాతో దక్కించుకుంది. శుక్రవారం చిన్నస్వామి స్టేడియంలో జరిగిన చివరిదైన మూడో వన్డేలో భారత్‌పై దక్షిణాఫ్రికా నాలుగు వికెట్ల తేడాతో నెగ్గింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత మహిళ జట్టు 47.3 ఓవర్లలో 180 పరుగులకు ఆలౌట్ అయ్యింది.

శిఖా పాండే (59 బంతుల్లో 59; 9 ఫోర్లు; 1 సిక్స్), హర్మన్‌ప్రీత్ కౌర్ (39 బంతుల్లో 42; 5 ఫోర్లు; 1 సిక్స్) రాణించారు. అనంతరం స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన సఫారీ జట్టు 48 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 184 పరుగులు చేసి నెగ్గింది. నాడిన్ మూడ్లే (90 బంతుల్లో 54; 7 ఫోర్లు) అర్ధ సెంచరీ సాధించింది. జులన్ గోస్వామి, దీప్తి శర్మలకు రెండేసి వికెట్లు దక్కాయి.

Advertisement
 
Advertisement
Advertisement