the three-match ODI series
-
జింబాబ్వేపై బంగ్లాదేశ్ క్లీన్‌స్వీప్
ఢాకా: జింబాబ్వేతో జరిగిన మూడు వన్డేల సిరీస్‌ను బంగ్లాదేశ్ జట్టు క్లీన్‌స్వీప్ చేసింది. బుధవారం చివరిదైన మూడో వన్డేలోనూ ఆతిథ్య జట్టు 61 పరుగుల తేడాతో నెగ్గింది. దీంతో 3-0తో సిరీస్ దక్కించుకుంది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన బంగ్లా 50 ఓవర్లలో 9 వికెట్లకు 276 పరుగులు చేసింది. తమీమ్ ఇక్బాల్ (98 బంతుల్లో 73; 7 ఫోర్లు; 1 సిక్స్), కయేస్ (95 బంతుల్లో 73; 6 ఫోర్లు; 4 సిక్సర్లు), మహ్ముదుల్లా (40 బంతుల్లో 52; 5 ఫోర్లు; 1 సిక్స్) అర్ధ సెంచరీలు సాధించారు. అనంతరం జింబాబ్వేను పేసర్ ముస్తాఫిజుర్ (5/34) వణికించాడు. దీంతో 43.3 ఓవర్లలో 215 పరుగులకు ఆలౌట్ అయ్యింది. -
దక్షిణాఫ్రికాదే సిరీస్
2-1తో భారత్ మహిళలపై విజయం బెంగళూరు: భారత మహిళల క్రికెట్ జట్టుతో జరిగిన మూడు వన్డేల సిరీస్‌ను దక్షిణాఫ్రికా జట్టు 2-1 తేడాతో దక్కించుకుంది. శుక్రవారం చిన్నస్వామి స్టేడియంలో జరిగిన చివరిదైన మూడో వన్డేలో భారత్‌పై దక్షిణాఫ్రికా నాలుగు వికెట్ల తేడాతో నెగ్గింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత మహిళ జట్టు 47.3 ఓవర్లలో 180 పరుగులకు ఆలౌట్ అయ్యింది. శిఖా పాండే (59 బంతుల్లో 59; 9 ఫోర్లు; 1 సిక్స్), హర్మన్‌ప్రీత్ కౌర్ (39 బంతుల్లో 42; 5 ఫోర్లు; 1 సిక్స్) రాణించారు. అనంతరం స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన సఫారీ జట్టు 48 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 184 పరుగులు చేసి నెగ్గింది. నాడిన్ మూడ్లే (90 బంతుల్లో 54; 7 ఫోర్లు) అర్ధ సెంచరీ సాధించింది. జులన్ గోస్వామి, దీప్తి శర్మలకు రెండేసి వికెట్లు దక్కాయి.