క్వార్టర్స్‌లో సౌరవ్‌ ఓటమి | Sourav defeat at quarter finals | Sakshi
Sakshi News home page

క్వార్టర్స్‌లో సౌరవ్‌ ఓటమి

Mar 2 2019 1:28 AM | Updated on Mar 2 2019 1:28 AM

Sourav  defeat at quarter finals - Sakshi

షికాగో (అమెరికా): ప్రొఫెషనల్‌ స్క్వాష్‌ అసోసియేషన్‌ (పీఎస్‌ఏ) ప్రపంచ చాంపియన్‌షిప్‌లో భారత పోరాటం ముగిసింది. పురుషుల సింగిల్స్‌ బరిలో మిగిలిన సౌరవ్‌ ఘోషాల్‌ క్వార్టర్‌ ఫైనల్లో ఓడిపోయాడు. ఏకపక్షంగా సాగిన క్వార్టర్‌ ఫైనల్లో 11వ సీడ్‌ సౌరవ్‌ 8–11, 6–11, 7–11తో మూడో సీడ్‌ సైమన్‌ రోస్నర్‌ (జర్మనీ) చేతిలో ఓడిపోయాడు. తొలి గేమ్‌లో 6–2తో ఆధిక్యంలో నిలిచిన సౌరవ్‌ ఆ తర్వాత తడబడి తేరుకోలేకపోయాడు. ఈ గెలుపుతో ప్రపంచ స్క్వాష్‌ చాంపియన్‌షిప్‌లో సెమీఫైనల్‌కు చేరిన తొలి జర్మనీ ప్లేయర్‌గా రోస్నర్‌ నిలిచాడు. 

Advertisement
 
Advertisement
Advertisement