సోమ్‌దేవ్ ఓటమి | Somdev lost the match | Sakshi
Sakshi News home page

సోమ్‌దేవ్ ఓటమి

Jun 11 2014 1:19 AM | Updated on Sep 2 2017 8:35 AM

సోమ్‌దేవ్ ఓటమి

సోమ్‌దేవ్ ఓటమి

భారత టెన్నిస్ స్టార్ ఆటగాడు సోమ్‌దేవ్ దేవ్‌వర్మన్ మరోసారి తొలిరౌండ్ అడ్డంకిని అధిగమించలేకపోయాడు.

లండన్: భారత టెన్నిస్ స్టార్ ఆటగాడు సోమ్‌దేవ్ దేవ్‌వర్మన్ మరోసారి తొలిరౌండ్ అడ్డంకిని అధిగమించలేకపోయాడు. ఎగాన్ చాంపియన్‌షిప్‌లో సోమ్‌దేవ్ తొలిరౌండ్‌లో 4-6, 5-7తో కెన్నీ డి షెపర్ (ఫ్రాన్స్) చేతిలో ఓటమి చవిచూశాడు. గంటా 15 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో భారత ప్లేయర్ పేలవ ప్రదర్శనతో మూల్యం చెల్లించుకున్నాడు.

మ్యాచ్ మొత్తంలో ఒక్క బ్రేక్ పాయింట్‌ను కూడా సాధించలేకపోయిన అతను రెండుసార్లు సర్వీస్‌ను చేజార్చుకున్నాడు. ఏటీపీ సర్క్యూట్‌లో సోమ్‌దేవ్ ఆడిన చివరి పది టోర్నీల్లో కేవలం రెండు మ్యాచ్‌లు మాత్రమే గెలిచాడు.
 
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement