స్మృతి మంధన డకౌట్‌ | Smriti Mandhana Disappointed in Third odi against South Africa | Sakshi
Sakshi News home page

Feb 10 2018 3:14 PM | Updated on Feb 10 2018 3:14 PM

Smriti Mandhana Disappointed in Third odi against South Africa - Sakshi

నిరాశగా వెనుదిరుగుతున్న మంధన

పోట్చెస్ట్‌రూమ్‌ : ఐసీసీ మహిళల చాంపియన్‌షిప్‌లో భాగంగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న చివరి వన్డేలో భారత ఓపెనర్‌ స్మృతి మంధన డకౌట్‌గా వెనుదిరిగారు. ఈ ‍మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన మిథాలీ సేన తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది. తొలి వన్డేలో 88, రెండో వన్డేలో సెంచరీతో రాణించి భారత విజయంలో కీలక పాత్ర పోషించిన డాషింగ్‌ ఓపెనర్‌ మంధన ఈ మ్యాచ్‌లో అభిమానులను తీవ్రంగా నిరాశ పరిచారు. దీంతో భారత మహిళలు పరుగుల ఖాతా తెరవకుండానే వికెట్‌ కోల్పోయారు.

అనంతరం క్రీజులోకి వచ్చిన కెప్టెన్‌ మిథాలీ రాజ్ ‌(4) సైతం త్వరగా ఔటై పెవిలియన్‌ చేరారు. దీంతో భారత్‌ 10 పరుగులకే రెండు కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. మరో ఓపెనర్‌ దీప్తీ శర్మతో వైస్‌ కెప్టెన్‌ హర్మన్‌ ప్రీత్‌ కౌర్‌ ఇన్నింగ్స్‌ చక్కదిద్దే ప్రయత్నం చేశారు. జట్టు స్కోరు 57 పరుగుల వద్ద హర్మన్‌(25) క్యాచ్‌ ఔట్‌గా వెనుదిరిగారు. దీంతో భారత్‌ 55 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. క్రీజులో దీప్తీ శర్మ(33), వేద కృష్ణమూర్తి(25)లు పోరాడుతున్నారు. 25 ఓవర్లు ముగిసే సరికి భారత్‌  స్కోరు 88/3

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement