మైదానంలో స్లెడ్జింగ్.. బయట డ్యాన్సింగ్ | Sledging on the ground and outside dancing | Sakshi
Sakshi News home page

మైదానంలో స్లెడ్జింగ్.. బయట డ్యాన్సింగ్

May 17 2015 1:56 PM | Updated on Sep 3 2017 2:10 AM

మైదానంలో స్లెడ్జింగ్.. బయట డ్యాన్సింగ్

మైదానంలో స్లెడ్జింగ్.. బయట డ్యాన్సింగ్

క్రికెట్ మైదానంలో ప్రత్యర్థులపై మాటల యుద్ధానికి దిగడంలో వెస్టిండీస్ స్టార్ డ్వేన్ బ్రేవో, భారత టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లి ఇద్దరూ ఇద్దరే.

 క్రికెట్ మైదానంలో ప్రత్యర్థులపై మాటల యుద్ధానికి దిగడంలో వెస్టిండీస్ స్టార్ డ్వేన్ బ్రేవో, భారత టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లి ఇద్దరూ ఇద్దరే. ఇక ఐపీఎల్‌లో ఈ ఇద్దరూ ప్రత్యర్థులుగా తలపడినప్పుడు కూడా ఇది సహజం. ఇటీవల చెన్నై, బెంగళూరుల మధ్య జరిగిన మ్యాచ్‌లో కోహ్లి బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ఈ ఇద్దరి మధ్య స్వల్ప వాగ్వాదం జరిగింది. ఇంతవరకూ బాగానే ఉంది. కానీ ఆ మ్యాచ్ ముగిసిన వెంటనే తెల్లారి ఇద్దరూ కలిసి డ్యాన్స్ చేశారు. డ్వేన్ బ్రేవో ‘చలోచలో’ అనే పాటను తయారు చేస్తున్నాడు.

బ్రేవో పాప్ సింగర్‌గా మారాలనే ఉద్దేశంతో ఈ పాటతో ఆల్బమ్ తయారు చేస్తున్నాడు. ఇందులో భాగంగా తయారు చేస్తున్న వీడియోలో బ్రేవో, కోహ్లి కలిసి డ్యాన్స్ చేశారు. మైదానంలో స్లెడ్జింగ్ చేసుకుని 24 గంటలు కూడా గడవకముందే సరదాగా కలిసి ఎంజాయ్ చేశారు. అన్నట్లు ఈ వీడియోలో ధోని, రవీంద్ర జడేజా, పొలార్డ్, స్యామీ, మెకల్లమ్, హస్సీ, రస్సెల్‌ల డ్యాన్స్ కూడా ఉంటుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement