నా సెంచరీ కంటే ఆ రెండు పాయింట్లే కీలకం

Sixteen Hundreds Are Great But  Getting Two Points Is Valuable Says David Warner - Sakshi

ఆస్ట్రేలియన్‌ ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌

నాటింగ్‌హమ్‌ : ప్రపంచకప్‌లో భాగంగా ట్రెంట్‌ బ్రిడ్జ్‌లో గురువారం బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో 166 పరుగుల అద్వితీయమైన ఇన్నింగ్స్‌తో డేవిడ్‌ వార్నర్‌ జట్టును గెలిపించడంలో కీలకపాత్ర పోషించిన సంగతి తెలిసిందే.  మ్యాచ్‌ పూర్తయిన తర్వాత వార్నర్‌ మీడియాతో మాట్లాడుతూ ‘ నేను సెంచరీ చేసిన దాని కంటే ఈ గెలుపుతో మా జట్టుకు లభించిన 2 పాయింట్లతో  పట్టికలో అగ్రస్థానానికి చేరడం నాకు సంతోషాన్ని కలిగించింది. మ్యాచ్‌ ఆరంభంలో బంగ్లా బౌలర్లు కొత్త బాల్‌తో బాగానే ఇబ్బంది పెట్టారు. అటువంటి కఠిన పరిస్థితుల్లో మొదట్లో నిలదొక్కుకొవడానికి ప్రయత్నించామని, తర్వాత పరుగులు వాటంతట అవే వచ్చాయని’  పేర్కొన్నాడు.

ఆస్ట్రేలియా తరపున ప్రపంచకప్‌లో 150కి పైగా పరుగులు సాధించిన మొదటి బ్యాట్స్‌మెన్‌గా రికార్డుల్లోకెక్కాడు. ఇంతకు ముందు ఈ రికార్డు మాజీ కెప్టెన్‌ రికీ పాంటింగ్‌, మాజీ వికెట్‌కీపర్‌ ఆడం గిల్‌క్రిస్ట్‌ల పేరిట ఉండేది.  జట్టు తరపున మొత్తం 16 సెంచరీలు చేసిన వార్నర్‌ ఆడం గిల్‌క్రిస్ట్‌తో సంయుక్తంగా మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. తొలి రెండు స్థానాల్లో రికీ పాంటింగ్‌(29), మార్క్‌ వా(19)లు ఉన్నారు.


 

 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top