
సాక్షి, హైదరాబాద్: అఖిల భారత టెన్నిస్ సంఘం (ఐటా) మహిళల టోర్నమెంట్‌లో తెలంగాణ అమ్మాయి సింధు జనగాం మెరుగైన ప్రదర్శనతో ఆకట్టుకుంది. బెంగళూరులో జరిగిన ఈ టోర్నీలో తన భాగస్వామి శరణ్య శెట్టితో కలిసి డబుల్స్ విభాగంలో రన్నరప్‌గా నిలిచింది.
ఆదివారం జరిగిన మహిళల డబుల్స్ ఫైనల్లో సింధు (తెలంగాణ)– శరణ్య (మహారాష్ట్ర) జంట 4–6, 6–1, 6–10తో అవిష్క గుప్తా (జార్ఖండ్)–ఎం. ఆర్తి (తమిళనాడు) జోడీ చేతిలో సూపర్ టైబ్రేక్‌లో పరాజయం పాలైంది.