రన్నరప్‌ సింధు | sindhu janagam as runnerup in all india womens tennis tourney | Sakshi
Sakshi News home page

రన్నరప్‌ సింధు

Dec 16 2017 10:31 AM | Updated on Sep 4 2018 5:32 PM

sindhu janagam as runnerup in all india womens tennis tourney - Sakshi

 సాక్షి, హైదరాబాద్‌: అఖిల భారత మహిళల టెన్నిస్‌ టోర్నమెంట్‌లో హైదరాబాద్‌ అమ్మాయి సింధు జనగాం ఆకట్టుకుంది. ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌లో జరిగిన ఈ టోర్నీలో డబుల్స్‌ విభాగంలో రన్నరప్‌గా నిలిచింది. శుక్రవారం జరిగిన టైటిల్‌ పోరులో సింధు (తెలంగాణ)– మహ్రుక్‌ కోక్ని (మహారాష్ట్ర) ద్వయం 2–6, 4–6తో తీర్థ ఇస్కా (ఏపీ)– ప్రీతి ఉజ్జిని (కర్ణాటక) జోడి చేతిలో ఓటమి పాలైంది. అంతకుముందు జరిగిన సెమీఫైనల్లో సింధు–మహ్రుక్‌ ద్వయం 6–4, 6–2తో ధారణ–నవనీ (ఛత్తీస్‌గఢ్‌) జంటపై గెలుపొందింది.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement