ఎయిర్‌పోర్టులో ధావన్‌కు చేదు అనుభవం

 Shikhar Dhawan's Family Not Allowed to Board Flight to SA - Sakshi

దుబాయ్‌ : టీమిండియా ఓపెనర్‌ శిఖర్‌ధావన్‌కు దుబాయ్‌ విమానాశ్రయంలో చేదు అనుభవం ఎదురైంది. దక్షిణాఫ్రికా పర్యటనలో భాగంగా కుటుంబంతో బయలుదేరిన ధావన్‌ కుటుంబాన్ని ఎయిర్‌లైన్స్‌ అధికారులు బోర్డింగ్‌కు అనుమతించలేదు. ఈ విషయంపై ధావన్‌ ట్విట్టర్‌ వేదికగా అసహనం వ్యక్తం చేశాడు.

‘నాతో దక్షిణాఫ్రికా వస్తున్న నా ఫ్యామిలీని అడ్డుకోవడం ఎమిరేట్స్‌కు అనైతిక చర్య. నా భార్య, పిల్లలకు దుబాయ్‌ నుంచి దక్షిణాఫ్రికా వెళ్లే విమానానికి బోర్డింగ్‌ ఇవ్వలేదు. మా పిల్లల జనన ధృవీకరణ పత్రాలు సమర్పించాలని కోరారు. ఆ సమయంలో అవి అందుబాటులో లేవు. వాటికోసం వారు దుబాయ్‌ ఎయిర్‌పోర్టులో నిరీక్షిస్తున్నారు. ముంబై విమానాశ్రయంలోనే ఈ పత్రాలను అడిగి ఉంటే ఈ సమస్య వచ్చేది కాదు. ఎలాంటి కారణం లేకుండా ఓ ఎమిరేట్స్‌ ఉద్యోగి తన కుటుంబ పట్ల దురుసుగా ప్రవర్తించాడని’  అసహనం వ్యక్తం చేశాడు.

ఇక చీలమండ గాయంతో బాధపడుతున్న ధావన్‌ తొలి టెస్టుకు దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. హోటల్‌కు చేరే సమయంలో ధావన్‌ తన ఎడమ చీలమండకు పట్టీ కట్టుకొని కనిపించాడు. ధావన్‌ గాయంపై ఫిజియో నుంచి ఎలాంటి సమాచారం అందలేదని, అతను తొలి మ్యాచ్‌ ఆడుతాడా లేదా అని ఇప్పుడే చెప్పలేమని ఓ బీసీసీఐ సీనియర్‌ అధికారి తెలిపారు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top