ఐస్‌ క్రికెట్‌ : మళ్లీ ఓడిన సెహ్వాగ్‌ టీం | Shewag team another loss | Sakshi
Sakshi News home page

Feb 9 2018 8:07 PM | Updated on Feb 9 2018 8:30 PM

 Shewag team another loss - Sakshi

మ్యాచ్‌లో ప్రయర్, సెహ్వాగ్, అక్తర్‌

సెయింట్‌ మోర్టిజ్‌ : సీనియర్‌ క్రికెటర్ల ఐస్‌ క్రికెట్‌ రెండో రోజు సైతం సరదాగా సాగింది. ఈ మ్యాచ్‌లోనూ భారత డాషింగ్‌ ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ డైమండ్స్‌ జట్టుపై 8 వికెట్ల తేడాతో ఆఫ్రిది రాయల్స్‌ గెలుపొందింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన సెహ్వాగ్‌ డైమండ్స్‌ జట్టు నిర్ణీత 20 ఓవర్లకు ఐదు వికెట్లు కోల్పోయి 205 పరుగులు చేసింది.

206 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆఫ్రిది రాయల్స్‌ జట్టు 16.4 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేధించింది. జాక్వస్‌ కల్లీస్‌(90 నాటౌట్‌), ఒవైస్‌ షా(37 నాటౌట్‌)గా నిలిచారు. డైమండ్స్‌ జట్టు బౌలింగ్‌లో దారుణంగా విఫలమమడంతో రాయల్స్‌ జట్టు అలవోక విజయం సాధించింది. అంతకు ముందు డైమండ్స్‌ జట్టులో సైమండ్స్‌ (67), మహ్మద్‌ కైఫ్‌ (57), సెహ్వాగ్‌ (48) పరుగులు చేశారు. చాల రోజుల అనంతరం బ్యాట్‌ పట్టిన ఈ సీనియర్‌ క్రికెటర్లు అద్భుత షాట్‌లతో అభిమానులను అలరించారు. 

ఇక బుధవారం జరిగిన తొలి మ్యాచ్‌లో సైతం ఆఫ్రిది జట్టే గెలుపొందిన విషయం తెలిసిందే.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement