భారత డేవిస్ కప్ ఆటగాడు యూకీ బాంబ్రీ... షాంఘై ఏటీపీ చాలెంజర్ టెన్నిస్ టోర్నమెంట్‌లో విజేతగా నిలిచాడు
షాంఘై (చైనా) : భారత డేవిస్ కప్ ఆటగాడు యూకీ బాంబ్రీ... షాంఘై ఏటీపీ చాలెంజర్ టెన్నిస్ టోర్నమెంట్‌లో విజేతగా నిలిచాడు. ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో యూకీ 3-6, 6-0, 7-6 (7/3)తో వుయ్ ది (చైనా)పై నెగ్గి టైటిల్‌ను గెలుచుకున్నాడు. హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్‌లో యూకీ ఆరు ఏస్‌లు సంధించగా, వుయ్ ఒకదానితో సరిపెట్టుకున్నాడు. యూకీ కెరీర్‌లో ఇది నాలుగో ఏటీపీ చాలెంజర్ సింగిల్స్ టైటిల్.