
సౌతాంప్టన్: శక్తి మేర ఆడితే తాము భారత్‌ను ఓడించగలమని అంటున్నాడు బంగ్లాదేశ్ స్టార్ ఆల్‌రౌండర్ షకీబుల్ హసన్. ప్రస్తుతం సూపర్ ఫామ్‌లో ఉన్న షకీబ్... ప్రపంచ కప్‌లో 1000 పరుగులు చేసిన తొలి బంగ్లా బ్యాట్స్‌మన్‌గా రికార్డులకెక్కాడు. అఫ్గాన్‌పై గెలుపు అనంతరం ఏడు మ్యాచ్‌ల్లో ఏడు పాయింట్లతో ఉందీ జట్టు. సెమీఫైనల్స్ చేరాలంటే భారత్ (జూలై 2), పాకిస్తాన్‌పై (జూలై 5) విజయం సాధించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో షకీబ్ మాట్లాడుతూ... ‘భారత్ అగ్ర జట్టు. టైటిల్‌కు గట్టి పోటీదారుగా ఉన్న అలాంటి జట్టును ఓడించడం కష్టమే. కానీ, అత్యుత్తమ స్థాయి ఆటతో మా శక్తి మేర ప్రయత్నిస్తాం’ అని పేర్కొన్నాడు. ఫలితాన్ని మార్చగల ప్రపంచ స్థాయి ఆటగాళ్లున్న టీమిండియాతో మ్యాచ్‌లో అనుభవం ప్రధాన పాత్ర పోషిస్తుందని షకీబ్ అన్నాడు. కప్‌లో తన ఫామ్ (476 పరుగులు, 10 వికెట్లు)పై అతడు పూర్తి సంతృప్తి వ్యక్తం చేశాడు. వ్యక్తిగత రాణింపుతో అవసరమైన సమయంలో జట్టుకు ఉపయోగపడుతుండటం పట్ల సంతోషం వ్యక్తం చేశాడు.