జాతీయ క్రీడా అవార్డుల కమిటీలో సెహ్వాగ్, పీటీ ఉష | Sehwag, PT Usha named in Khel Ratna, Arjuna Award committee | Sakshi
Sakshi News home page

జాతీయ క్రీడా అవార్డుల కమిటీలో సెహ్వాగ్, పీటీ ఉష

Jul 28 2017 12:29 AM | Updated on Sep 5 2017 5:01 PM

జాతీయ క్రీడా అవార్డుల కమిటీలో సెహ్వాగ్, పీటీ ఉష

జాతీయ క్రీడా అవార్డుల కమిటీలో సెహ్వాగ్, పీటీ ఉష

ఈ ఏడాది కేంద్ర ప్రభుత్వం అందించే జాతీయ క్రీడా పురస్కారాల ఎంపిక కోసం కమిటీని ప్రకటించారు.

ఈ ఏడాది కేంద్ర ప్రభుత్వం అందించే జాతీయ క్రీడా పురస్కారాల ఎంపిక కోసం కమిటీని ప్రకటించారు. 12 మంది సభ్యులతో కూడిన ఈ కమిటీలో భారత మాజీ క్రికెటర్‌ వీరేంద్ర సెహ్వాగ్, అథ్లెటిక్స్‌ దిగ్గజం పీటీ ఉషలకు చోటు కల్పించారు. రిటైర్డ్‌ జస్టిస్‌ సీకే ఠక్కర్‌ ఈ కమిటీకి నేతృత్వం వహిస్తారు.

ముకుంద్‌  (బాక్సింగ్‌), సునీల్‌ దబాస్‌ (కబడ్డీ), ఎం.ఆర్‌.మిశ్రా, ఎస్‌. కన్నన్, సంజీవ్‌ కుమార్‌ (జర్నలిస్ట్స్‌), లతా మాధవి (పారాథ్లెట్‌), అనిల్‌ ఖన్నా (క్రీడాధికారి), ఇంజేటి శ్రీనివాస్‌ (డీజీ, సాయ్‌), రాజ్‌వీర్‌ సింగ్‌ (సంయుక్త కార్యదర్శి, క్రీడా శాఖ) మిగతా సభ్యులుగా ఉన్నారు. ఆగస్టు 3న ఈ కమిటీ సమావేశమై అవార్డీలను ఎంపిక చేస్తుంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement