‘ఇది నా కెరీర్‌లోనే అత్యుత్తమం’

Sealing semis spot at my home ground a career high, Wood - Sakshi

చెస్టర్‌ లీ స్ట్రీట్‌: వన్డే వరల్డ్‌కప్‌లో ఇంగ్లండ్‌ సెమీఫైనల్‌కు అర్హత సాధించడంపై ఆ జట్టు ఫాస్ట్‌ బౌలర్‌ మార్క్‌వుడ్‌ ఆనందంలో మునిగి తేలుతున్నాడు. ఆస్ట్రేలియా, శ్రీలంక జట్లపై పరాజయాల తర్వాత వరుస విజయాలు సాధించి సెమీస్‌లో అడుగుపెట్టే అది జట్టు సమిష్టి కృషేనన్నాడు. తమ జట్టు సెమీస్‌లో అడుగుపెట్టడం తన కెరీర్‌లోనే అత్యుత్తమంగా అభివర్ణించాడు మార్క్‌వుడ్‌ ‘ నా అరంగేట్రం దగ్గర్నుంచీ చూస్తే ఇదే నాకు అత్యుత్తమం అనడంలో ఎటువంటి సందేహం లేదు. స్వదేశంలో జరుగుతున్న వరల్డ్‌కప్‌ కావడమే ఇందుకు కారణం. భారత్‌, న్యూజిలాండ్‌ జట్లను ఓడించి టాప్‌-4లో చోటు సంపాదించాం. మా పూర్తి స్థాయి ప్రదర్శన కనబరిచిన కారణంగానే రెండు ఉత్తమ జట్లపై విజయాలు నమోదు చేశాం. 

రెండు వరుస పరాజయాల తర్వాత రెండు విజయాలు సాధించడంతో మా జట్టు సభ్యులంతా ఆత్మవిశ్వాసంతో ఉన్నారు. మరొక పెద్ద మ్యాచ్‌కు సిద్ధమవుతున్నాం. సెమీస్‌లో మా ప్రణాళికలు పక్కాగా అమలు చేస్తాం’ అని మార్క్‌వుడ్‌ తెలిపాడు. బుధవారం న్యూజిలాండ్‌తో జరిగిన పోరులో మార్క్‌వుడ్‌ 3 వికెట్లు సాధించి ఇంగ్లండ్‌ ఘన విజయంలో కీలక పాత్ర పోషించాడు. సెమీ ఫైనల్‌ మ్యాచ్‌ ఆడబోయే ఇంగ్లండ్‌ తుది జట్టులో మార్క్‌వుడ్‌ ఎంపికైతే అది అతనికి 50 వన్డే అవుతుంది.


 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top