ఇంగ్లండ్‌పై పసికూన పంజా

Scotland Win By 6 Runs Against England - Sakshi

పసికూన స్కాట్లాండ్‌ ఇంగ్లండ్‌కు భారీ షాక్‌ ఇచ్చింది. ఆదివారం జరిగిన ఏకైక వన్డేలో 6 పరుగుల తేడాతో స్కాట్లాండ్‌ ఘన విజయం సాధించింది. 372 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్‌కు ఓపెనర్లు కళ్లు చెదిరేరీతిలో శుభారంభాన్ని అందించారు. జాసన్‌ రాయ్‌(34), బెయిర్‌ స్టో(105; 59 బంతుల్లో 12ఫోర్లు, 6 సిక్సర్లు) మెరుపు ఆరంభాన్ని అందించారు. మార్క్‌ వాట్‌ బౌలింగ్‌లో జాసన్‌ రాయ్‌ వెనుదిరగడంతో క్రీజులోకి వచ్చిన అలెక్స్‌ హేల్స్‌(52) అర్థసెంచరీతో రాణించాడు.

టాప్‌ ఆర్డర్‌ రాణించడంతో భారీ లక్ష్యాన్ని సులువుగా ఛేదిస్తారనుకున్న తరుణంలో రూట్‌(29), కెప్టెన్‌ మోర్గాన్‌(20), బిల్లింగ్స్‌(12) వరుసగా వికెట్లు చేజార్చుకోవడంతో ఇంగ్లండ్‌ పీకల్లోతు కష్టాల్లో పడింది. చివర్లో మొయిన్‌ అలీ(46), ప్లంకెట్‌(47) పోరాడినా జట్టుకు విజయాన్ని అందించలేకపో​యారు. ఇన్నింగ్స్‌ మొదట్లో ధారాళంగా పరుగులిచ్చిన స్కాట్లాండ్‌ బౌలర్లు, చివర్లో కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేస్తూ ప్రత్యర్థి జట్టుపై ఒత్తిడి పెంచి వరుసగా వికెట్లు సాధించారు. స్కాట్లాండ్‌ బౌలర్లలో మార్క్‌ వ్యాట్‌ మూడు వికెట్లు సాధించగా.. ఎవాన్స్‌, బెరింగ్టన్‌ చెరో రెండు వికెట్లు తీయగా, షరీఫ్‌ ఒక వికెట్‌ దక్కించుకున్నారు.

అంతకుముందు టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేపట్టిన స్కాట్లాండ్‌కు ఓపెనర్లు శుభారంభాన్ని అందించారు. బ్యాట్స్‌మెన్‌ మాథ్యూ క్రాస్‌ (48; 39 బంతుల్లో 10ఫోర్లు), కెప్టెన్‌ కైలే కోయెట్జర్ ‌(58; 49బంతుల్లో 8ఫోర్లు, 2సిక్సర్లు) చెలరేగడంతో తొలి వికెట్‌కు సెంచరీ భాగస్వామ్యం నమోదు చేశారు. ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడిని రషీద్‌ విడదీశాడు. 

అనంతరం క్రీజులోకి వచ్చిన కామ్‌ మెక్‌లీడ్‌ (140 నాటౌట్‌; 94 బంతుల్లో 16ఫోర్లు, 3సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగి సెంచరీ నమోదు చేశాడు. చివర్లో జార్జ్‌ మున్సే(55), బెరింగ్టన్‌(39) చెలరేగడంతో స్కాట్లాండ్‌ నిర్ణీత 50 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 371 పరుగుల భారీస్కోర్‌ సాధించింది. ఇంగ్లండ్‌ బౌలర్లలో రషీద్‌, ప్లంకెట్‌ తలో రెండు వికెట్లు సాధించగా, మార్క్‌ వుడ్‌ ఒక వికెట్‌ దక్కించుకున్నాడు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top