500 చేస్తాం.. పాక్‌ కెప్టెన్‌ హాస్యం

Sarfaraz Ahmed Says Miracles Can Happen - Sakshi

నేడు బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌

మధ్యాహ్నం గం.3 నుంచి స్టార్‌ స్పోర్ట్స్‌1లో ప్రత్యక్ష ప్రసారం 

లండన్‌ : వన్డే చరిత్రలోనే ఏ జట్టూ సాధించలేని విధంగా 316 పరుగుల తేడాతో గెలిస్తే కానీ ప్రపంచ కప్‌ సెమీఫైనల్‌ చేరని పరిస్థితుల్లో ఉన్న పాకిస్తాన్‌ శుక్రవారం చరిత్రాత్మక లార్డ్స్‌ మైదానంలో బంగ్లాదేశ్‌ను ఎదుర్కోనుంది. ఇలాంటి నేపథ్యంలోనూ మీడియా సమావేశంలో మాట్లాడుతూ తాము 500 పరుగులు చేస్తామని పాక్‌ కెప్టెన్‌ సర్ఫరాజ్‌ ఖాన్‌ జోక్‌ చేశాడు. అంతలోనే వెనక్కు తగ్గి తాము అంత భారీ స్కోరు చేసిన చోట ప్రత్యర్థిని అత్యల్ప స్కోరుకు ఎలా పరిమితం చేయగలమంటూ ప్రశ్నించాడు. ఈ మ్యాచ్‌లో బంగ్లా మొదట బ్యాటింగ్‌ ఎంచుకుంటే టాస్‌తోనే పాక్‌ ఆట ముగుస్తుంది. వరుస విజయాలతో 1992 ప్రపంచకప్‌ పరిస్థితులను పునరావృతం చేసిన పాక్‌.. ప్రపంచకప్‌ సొంతం చేసుకుంటామని భావించింది. కానీ పాక్‌ ఆశలపై భారత్‌, న్యూజిలాండ్‌లు నీళ్లు చల్లడంతో నిరాశతో టోర్నీ నుంచి నిష్క్రమించే దశకు చేరుకుంది. ఇంగ్లండ్‌పై ఈ ఇరు జట్లు ఓటమి పాలవ్వడంతో పాక్‌ సెమీస్‌ ఆశలు గల్లంతైన విషయం తెలిసిందే.

 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top