మూడో రౌండ్లోకి సానియా జోడి | Sania Mirza Wins, Rohan Bopanna Loses in australia open | Sakshi
Sakshi News home page

మూడో రౌండ్లోకి సానియా జోడి

Jan 20 2017 12:44 PM | Updated on Sep 5 2017 1:42 AM

మూడో రౌండ్లోకి సానియా జోడి

మూడో రౌండ్లోకి సానియా జోడి

ఆస్ట్రేలియా ఓపెన్లో భారత స్టార్ క్రీడాకారిణి సానియా మీర్జా మూడో రౌండ్లో ప్రవేశించింది.

సిడ్నీ: ఆస్ట్రేలియా ఓపెన్లో భారత స్టార్ క్రీడాకారిణి సానియా మీర్జా మూడో రౌండ్లో ప్రవేశించింది. మహిళల డబుల్స్ విభాగంలో భాగంగా శుక్రవారం జరిగిన పోరులో సానియా -బార్బరా స్ట్రికోవా (చెక్‌ రిపబ్లిక్‌) జోడి 6-1,6-4 తేడాతో సమంతా స్టుసుర్(ఆస్ట్రేలియా)-షాయ్ జంగ్(చైనా)పై గెలిచి మూడో రౌండ్లోకి అడుగుపెట్టింది.

 

గంటా 21 నిమిషాలు పాటు జరిగిన పోరులో వరుస రెండు సెట్లను సానియా జోడి కైవసం చేసుకుని విజయాన్నిసొంతం చేసుకుంది. మరొకపోరులో రోహన్ బోపన్న ఓటమి పాలయ్యాడు. పురుషుల డబుల్స్ రెండో రౌండ్ లో అలెక్స్ బోల్ట్- బ్రాడ్ లీ మోస్లీల జోడి 2-6, 7-6(2), 6-4 తేడాతో బోపన్న-పబ్లో క్యూవాస్ జంటను ఓడించింది.

 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement