సానియా జోడీకి షాక్! | sania mirza | Sakshi
Sakshi News home page

సానియా జోడీకి షాక్!

Apr 24 2015 1:18 AM | Updated on Sep 3 2017 12:45 AM

సానియా జోడీకి షాక్!

సానియా జోడీకి షాక్!

ప్రపంచ నంబర్‌వన్ హోదాలో తొలి సారి డబ్ల్యూటీఏ టోర్నమెంట్ బరిలోకి దిగిన భారత స్టార్ సానియా మీర్జాకు అనూహ్య ఓటమి ఎదురైంది.

 పోర్ష్ గ్రాండ్‌ప్రిలో తొలి రౌండ్‌లోనే ఓటమి
 స్టట్‌గార్ట్ (జర్మనీ): ప్రపంచ నంబర్‌వన్ హోదాలో తొలి సారి డబ్ల్యూటీఏ టోర్నమెంట్ బరిలోకి దిగిన భారత స్టార్ సానియా మీర్జాకు అనూహ్య ఓటమి ఎదురైంది. వరుస విజయాలతో దూసుకుపోతున్న సానియా-మార్టినా హింగిస్ జోడి ఇక్కడ జరుగుతున్న పోర్ష్ గ్రాండ్ ప్రి టోర్నీలో తొలి రౌండ్‌లో పరాజయం పాలైంది.
 
 బుధవారం అర్ధరాత్రి జరిగిన ఈ మ్యాచ్‌లో క్రొయేషియాకు చెందిన పెట్రా మార్టిక్-స్టెఫానీ జంట 6-3, 6-3 స్కోరుతో టాప్ సీడ్ సానియా-హింగిస్‌ను చిత్తు చేసింది. డబుల్స్‌లో జత కుదిరిన తర్వాత వరుసగా 14 మ్యాచ్‌లు గెలిచి ఇండియన్ వెల్స్, మియామీ, సర్కిల్ కప్ టోర్నీ టైటిల్స్ సాధించిన సానియా ద్వయానికి ఇదే మొదటి ఓటమి. మ్యాచ్ మధ్యలో వెన్ను నొప్పితో బాధ పడిన హింగిస్ చికిత్స చేయించుకుంది. ఇది కూడా ఫలితంపై ప్రభావం చూపించింది.
 

Advertisement
 
Advertisement
Advertisement