సమీర్ వర్మకు టైటిల్ | Sameer Verma to the title | Sakshi
Sakshi News home page

సమీర్ వర్మకు టైటిల్

Nov 8 2015 11:58 PM | Updated on Sep 3 2017 12:14 PM

సమీర్ వర్మకు టైటిల్

సమీర్ వర్మకు టైటిల్

బహ్రెయిన్ చాలెంజ్ అంతర్జాతీయ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో భారత ప్లేయర్ సమీర్ వర్మ విజేతగా నిలిచాడు.

న్యూఢిల్లీ: బహ్రెయిన్ చాలెంజ్ అంతర్జాతీయ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో భారత ప్లేయర్ సమీర్ వర్మ విజేతగా నిలిచాడు. బహ్రెయిన్‌లోని ఇసా టౌన్‌లో జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో ఈ మధ్యప్రదేశ్ కుర్రాడు 21-14, 21-10తో నాలుగో సీడ్, ప్రపంచ 47వ ర్యాంకర్ జీ లియాంగ్ డెరెక్ వోంగ్ (సింగపూర్)పై సంచలన విజయం సాధించాడు. వారం రోజుల వ్యవధిలో సమీర్ వర్మ రెండో సింగిల్స్ టైటిల్ సాధించడం విశేషం.

గతవారం ఇదే వేదికపై జరిగిన బహ్రెయిన్ ఇంటర్నేషనల్ సిరీస్ టోర్నీలో చాంపియన్‌గా నిలిచిన సమీర్ అదే జోరును చాలెంజ్ టోర్నీలోనూ కొనసాగించాడు. మరోవైపు భారత్‌కే చెందిన శైలి రాణే వరుసగా రెండో టోర్నీలో రన్నరప్‌తో సరిపెట్టుకుంది. మహిళల సింగిల్స్ ఫైనల్లో శైలి రాణే 22-24, 10-21తో నిచావోన్ జిందాపోల్ (థాయ్‌లాండ్) చేతిలో ఓడిపోయింది.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement