సైనా నెహ్వాల్ అవుట్ | saina nehwal loses to TAI Tzu Ying | Sakshi
Sakshi News home page

సైనా నెహ్వాల్ అవుట్

Dec 11 2015 8:19 PM | Updated on Sep 3 2017 1:50 PM

భారత బ్యాడ్మింటన్ స్టార్, ప్రపంచ రెండో ర్యాంకు క్రీడాకారిణి సైనా నెహ్వాల్ కు మరోసారి నిరాశ ఎదురైంది.

దుబాయ్:భారత బ్యాడ్మింటన్ స్టార్, ప్రపంచ రెండో ర్యాంకు క్రీడాకారిణి సైనా నెహ్వాల్ సూపర్ సిరీస్ ఫైనల్స్ టోర్నీ నుంచి నిష్క్రమించింది. శుక్రవారం జరిగిన మహిళల గ్రూప్-బి  మ్యాచ్ లో సైనా నెహ్వాల్ 21-16, 18-21, 14-21 తేడాతో తై జు యింగ్(చైనీస్ తైపీ) చేతిలో ఓటమి పాలైంది.  51నిమిషాల పాటు జరిగిన పోరులో సైనా పోరాడి ఓడింది.  తొలి సెట్ ను సైనా అవలీలగా గెలిచినా.. రెండో సెట్ లో తీవ్ర ప్రతిఘటన ఎదురైంది.ఈ క్రమంలోనే రెండో సెట్ ను సైనా కోల్పోయింది.

 

కాగా నిర్ణయాత్మక మూడో సెట్ లో  తీవ్ర ఒత్తిడికి లోనైన సైనా 14-21 తో గేమ్ ను చేజార్చుకుంది. దీంతో సైనా ఖాతాలో ఒక గెలుపు, రెండు ఓటములు ఉండటంతో టోర్నమెంట్ నుంచి నిష్ర్రమించక తప్పలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement