సెయిలింగ్‌లో రజతం, రెండు కాంస్యాలు 

Sailors overcome court battle, disqualification to win 3 medals - Sakshi

ఏషియాడ్‌లో భారత సెయిలర్లు ఒక రజతం, రెండు కాంస్యాలు అందించారు. మహిళల 49ఈఆర్‌ ఎఫ్‌ఎక్స్‌ ఈవెంట్‌లో వర్షా గౌతమ్‌–శ్వేతా షిర్వేగర్‌ ద్వయం 15 రేసులు పూర్తయ్యేసరికి 40 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచి రజతం సొంతం చేసుకుంది.

ఓపెన్‌ లేజర్‌ 4.7 విభాగంలో 16 ఏళ్ల హర్షిత తోమర్‌ 12వ రేసు అనంతరం 62 పాయింట్లతో నిలిచి కాంస్యం దక్కించుకుంది. పురుషుల 49 ఈఆర్‌లో వరుణ్‌ ఠక్కర్, చెంగప్ప గణపతి కేలపండ జోడీ 15వ రేసు తర్వాత 53 పాయింట్లు స్కోరు చేసి కాంస్యంతో సంతృప్తి పడింది.    

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top