సాయివిష్ణు, భార్గవి శుభారంభం | sai Vishnu and bhargavi win openers of all india jr badminton | Sakshi
Sakshi News home page

సాయివిష్ణు, భార్గవి శుభారంభం

Sep 5 2017 10:43 AM | Updated on Sep 12 2017 1:57 AM

ఆలిండియా సబ్‌ జూనియర్‌ ర్యాంకింగ్‌ బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌లో హైదరాబాద్‌ క్రీడాకారులు పుల్లెల సాయివిష్ణు, కె. భార్గవి శుభారంభం చేశారు.

సాక్షి, హైదరాబాద్‌: ఆలిండియా సబ్‌ జూనియర్‌ ర్యాంకింగ్‌ బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌లో హైదరాబాద్‌ క్రీడాకారులు పుల్లెల సాయివిష్ణు, కె. భార్గవి శుభారంభం చేశారు. ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడలో సోమవారం జరిగిన అండర్‌–15 బాలుర తొలిరౌండ్‌లో సాయివిష్ణు (తెలంగాణ) 21–19, 21–15తో సత„ŠS సింగ్‌ (ఢిల్లీ)పై, ప్రణవ్‌ రావు (తెలంగాణ) 21–11, 21–9తో భార్గవ్‌ రామిరెడ్డి (తెలంగాణ)పై గెలుపొందారు. బాలికల సింగిల్స్‌ తొలిరౌండ్‌ మ్యాచ్‌ల్లో నాలుగో సీడ్‌  భార్గవి (తెలంగాణ) 21–18, 21–18తో అవంతిక పాండే (ఉత్తరాఖండ్‌)పై, ఎనిమిదో సీడ్‌ కైవల్య లక్ష్మి (తెలంగాణ) 21–14, 21–15తో విదుషి సింగ్‌పై, తొమ్మిదో సీడ్‌ మేఘనా రెడ్డి (తెలంగాణ) 21–14, 21–11తో రియా (కేరళ)పై, అభిలాష 21–9, 21–12తో ఐశ్వర్య మెహతా (ఉత్తరాఖండ్‌)పై విజయం సాధించారు.  

అండర్‌–13 బాలుర తొలిరౌండ్‌ ఫలితాలు: లోకేశ్‌ రెడ్డి (తెలంగాణ) 21–14, 21–11తో నాగ మణికంఠ (ఏపీ)పై, అక్షత్‌ రెడ్డి (తెలంగాణ) 21–18, 21–16తో సాత్విక్‌ రెడ్డి (ఏపీ)పై, ఆశ్రిత్‌ వలిశెట్టి (తెలంగాణ) 21–18, 21–23, 21–18తో నిధిశ్‌ భట్‌పై, రుషేంద్ర తిరుపతి (తెలంగాణ) 18–21, 21–16, 21–9తో ఎల్‌. లోకేశ్‌ (తెలంగాణ)పై, అభినయ్‌ సాయిరాం (తెలంగాణ) 21–19, 21–6తో పూజిత్‌ రెడ్డిపై గెలుపొందారు.


బాలికలు: ప్రసన్న (తెలంగాణ) 21–9, 21–6తో ప్రియామృత (ఏపీ)పై, అమూల్య (తెలంగాణ) 21–17, 16–21, 21–18తో కర్నిక శ్రీ (కర్నాటక)పై, శ్రీనిత్య 21–10, 21–16తో ఆషిత (మధ్యప్రదేశ్‌)పై నెగ్గారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement