విజేతలు సచిన్, ప్రహర్షిత

Sachin And Praharshita Got Swimming Titles - Sakshi

ఇంటర్‌ స్కూల్‌ స్విమ్మింగ్‌ టోర్నీ

సాక్షి, హైదరాబాద్‌: ఇంటర్‌ స్కూల్‌ యూత్‌ స్విమ్మింగ్‌ చాంపియన్‌షిప్‌లో సచిన్‌ సాత్విక్, ప్రహర్షిత విజేతలుగా నిలిచారు. గచ్చిబౌలిలోని డాల్ఫిన్‌ స్విమ్మింగ్‌పూల్‌ వేదికగా జరిగిన ఈ చాంపియన్‌షిప్‌లో గ్రూప్‌–8 బాలుర విభాగంలో సచిన్‌... గ్రూప్‌–3 బాలికల బ్యాక్‌స్ట్రోక్‌ ఈవెంట్‌లో ప్రహర్షిత స్వర్ణ పతకాలను సొంతం చేసుకున్నారు. సచిన్‌ సాత్విక్‌ లక్ష్యాన్ని అందరికన్నా ముందుగా 32.19సెకన్లలో పూర్తి చేయగా... ఉదయ 37.09 సెకన్లలో చేరుకొని రజతాన్ని అందుకున్నాడు. రిషికేశ్‌ (41.16సె.) కాంస్యాన్ని గెలుచుకున్నాడు. బాలికల బ్యాక్‌స్ట్రోక్‌ ఈవెంట్‌లో ప్రహర్షిత (28.03సె.), హేమ వర్షిణి (28.60సె.), శ్రీజని (29.78సె.) వరుసగా పసిడి, రజత, కాంస్య పతకాలను అందుకున్నారు.

బాలికల బ్రెస్ట్‌స్ట్రోక్‌ విభాగంలో అనిక్‌ 33.66 సెకన్లలో లక్ష్యాన్ని చేరుకుని చాంపియన్‌గా నిలిచింది. సమీక్ష (33.69సె.), అవని (56.85సె.) వరుసగా రెండు, మూడు స్థానాలను దక్కించుకున్నారు. ఫ్రీస్టయిల్‌ విభాగంలో శ్రీజన్‌ (23.40సె.), ప్రహర్షిత (23.84సె.), తనీష అండ్‌ హేమవర్షిణి (23.94సె.)... బటర్‌ఫ్లయ్‌ విభాగంలో ప్రణవి (29.94సె.), లక్ష్య (36.26సె.), టియారా (36.35సె.) వరుసగా తొలి మూడు స్థానాల్లో నిలిచారు. పోటీల అనంతరం జరిగిన బహుమతి ప్రదాన కార్యక్రమంలో అక్వాటిక ఫినోమినన్‌ వ్యవస్థాపకులు సందీప్, సాధన ఇన్ఫినిటీ ఇంటర్నేషనల్‌ స్కూల్‌ ప్రిన్సిపాల్‌ హేమ ప్రకాశ్‌ ముఖ్య అతిథులుగా విచ్చేసి విజేతలకు పతకాలను అందజేశారు.    

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Taboola - Feed

Back to Top