అప్పటి నుంచి టాప్‌–5లోనే...

Russia In Top 5 Since 1996 In Medal Table List - Sakshi

రష్యా తొలిసారిగా ఒలింపిక్స్‌ బరిలో దిగింది 1996లో! అట్లాంటా (అమెరికా) ఆతిథ్యమిచ్చిన సమ్మర్‌ ఒలింపిక్స్‌ నుంచి గత ‘రియో’లో జరిగిన సమ్మర్‌ ఒలింపిక్స్‌ వరకు రష్యా పతకాల పట్టికలో ‘టాప్‌–5’లోనే నిలిచింది. 1996 అట్లాంటాలో 63 పతకాలతో రెండో స్థానంలో... 2000 సిడ్నీలో 89 పతకాలతో రెండో స్థానంలో... 2004 ఏథెన్స్‌లో 90 పతకాలతో మూడో స్థానంలో... 2008 బీజింగ్‌లో 60 పతకాలతో మూడో స్థానంలో... 2012 లండన్‌లో 68 పతకాలతో నాలుగో స్థానంలో... 2016 రియో ఒలింపిక్స్‌లో 56 పతకాలతో నాలుగో స్థానంలో నిలిచింది. అంతకంటే ముందు సోవియట్‌ యూనియన్‌లో భాగంగా బరిలోకి దిగింది. సోవియట్‌ యూనియన్‌ విచ్ఛిన్నమయ్యాక తొలిసారి 1992 బార్సిలోనా ఒలింపిక్స్‌లో ‘యూనిఫైడ్‌ టీమ్‌’గా పోటీపడింది. ఇక వింటర్‌ ఒలింపిక్స్‌లోనూ రష్యా ఆధిపత్యాన్ని చాటింది. రెండు సార్లు 1994, 2014లో అగ్రస్థానాన్ని పొందిన రష్యన్‌ బృందం వాంకోవర్‌ (2010)లో మినహా ప్రతీసారి టాప్‌–5లోనే నిలిచింది. వాంకోవర్‌లో మాత్రం 11వ స్థానంతో సరిపెట్టుకుంది.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top