రన్నరప్ సానియా జంట | Runner-up Sania | Sakshi
Sakshi News home page

రన్నరప్ సానియా జంట

Oct 5 2014 1:54 AM | Updated on Sep 2 2017 2:20 PM

రన్నరప్ సానియా జంట

రన్నరప్ సానియా జంట

సాక్షి, హైదరాబాద్: బీజింగ్ ఓపెన్ డబ్ల్యూటీఏ ప్రీమియర్ టెన్నిస్ టోర్నమెంట్‌లో సానియా మీర్జా (భారత్)-కారా బ్లాక్ (జింబాబ్వే) ద్వయం రన్నరప్‌గా నిలిచింది.

సాక్షి, హైదరాబాద్: బీజింగ్ ఓపెన్ డబ్ల్యూటీఏ ప్రీమియర్ టెన్నిస్ టోర్నమెంట్‌లో సానియా మీర్జా (భారత్)-కారా బ్లాక్ (జింబాబ్వే) ద్వయం రన్నరప్‌గా నిలిచింది. చైనాలోని బీజింగ్‌లో శనివారం జరిగిన మహిళల డబుల్స్ ఫైనల్లో సానియా-కారా బ్లాక్ ద్వయం 4-6, 4-6తో హలవకోవా (చెక్ రిపబ్లిక్)-షుయె పెంగ్ (చైనా) జోడీ చేతిలో ఓడిపోయింది. గంటా 28 నిమిషాలపాటు జరిగిన ఈ ఫైనల్లో సానియా జంట తమ సర్వీస్‌ను మూడుసార్లు కోల్పోయింది. మరోవైపు ప్రత్యర్థి జంట సర్వీస్‌ను 10 సార్లు బ్రేక్ చేసే అవకాశం వచ్చినా కేవలం ఒకసారి మాత్రమే సద్వినియోగం చేసుకుంది. రన్నరప్‌గా నిలిచిన సానియా జోడీకి 1,55,910 డాలర్ల (రూ. 96 లక్షలు) ప్రైజ్‌మనీతోపాటు 650 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి.



 

Advertisement
 
Advertisement
Advertisement