ప్రాక్టీస్కు రోహిత్ దూరం | Rohit sharma misses practice, Shikhar rusty at training session | Sakshi
Sakshi News home page

ప్రాక్టీస్కు రోహిత్ దూరం

Feb 29 2016 6:04 PM | Updated on Sep 3 2017 6:42 PM

ప్రాక్టీస్కు రోహిత్ దూరం

ప్రాక్టీస్కు రోహిత్ దూరం

ఆసియాకప్లో భాగంగా మంగళవారం శ్రీలంక-భారత జట్ల మధ్య జరుగనున్న ట్వంటీ 20 మ్యాచ్ లో ఓపెనర్ రోహిత్ శర్మ ఆడే అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయి.

మిర్పూర్:ఆసియాకప్లో భాగంగా మంగళవారం శ్రీలంకతో జరుగనున్న ట్వంటీ 20 మ్యాచ్ లో భారత ఓపెనర్ రోహిత్ శర్మ ఆడే అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయి. పాకిస్తాన్ తో మ్యాచ్ సందర్భంగా కాలిబొటనవేలికి గాయం కావడంతో రోహిత్ కు విశ్రాంతి అనివార్యమైంది.  దీంతో సోమవారం భారత జట్టు ప్రాక్టీస్ సెషన్కు హాజరుకాని రోహిత్ కేవలం హోటల్ రూమ్కే పరిమితమయ్యాడు.

శనివారం నాటి మ్యాచ్ లో పాకిస్తాన్ పేసర్ మొహ్మద్ అమిర్ వేసిన బంతి రోహిత్ కాలి బొటనవేలిపై పడింది. అయితే  ఆ తరువాత రోహిత్ వేలికి తీసిన ఎక్స్రేలో పెద్దపాటి గాయం ఏమీ కాలేదని తేలినా.. అతని ఫిట్ నెస్పై మాత్రం ఇంకా స్పష్టత రాలేదు. మరోవైపు గాయం కారణంగా పాకిస్తాన్ తో మ్యాచ్ నుంచి విశ్రాంతి తీసుకున్న శిఖర్ ధావన్ కూడా నామమాత్రంగానే ప్రాక్టీస్ సెషన్ లో పాల్గొన్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement