అంతా బాగుంటేనే ఐపీఎల్‌!  | Rohit Sharma Comments About IPL 2020 | Sakshi
Sakshi News home page

అంతా బాగుంటేనే ఐపీఎల్‌! 

Mar 28 2020 3:59 AM | Updated on Mar 28 2020 3:59 AM

Rohit Sharma Comments About IPL 2020 - Sakshi

ముంబై: కోవిడ్‌–19 కారణంగా భారతదేశం మొత్తం విపత్కర పరిస్థితుల్లో ఉన్నప్పుడు క్రీడలు ఏమాత్రం ప్రాధాన్యతాంశం కాదని భారత ఓపెనర్‌ రోహిత్‌ శర్మ అభిప్రాయ పడ్డాడు. ఇక ఐపీఎల్‌ గురించి ఈ సమయంలో ఆలోచించడంలో ఏమాత్రం అర్థం లేదని కూడా అతను అన్నాడు. ‘మనమంతా ముందు దేశం గురించి ఆలోచించాలి. అన్ని రకాలుగా పరిస్థితి మెరుగుపడాలి. అందరి జీవితాలు సాధారణ స్థితికి చేరిన తర్వాతే  మనం ఐపీఎల్‌ గురించి మాట్లాడుకుందాం’ అని రోహిత్‌ వ్యాఖ్యానించాడు. సహచర ఆటగాడు యజువేంద్ర చహల్‌తో ఇన్‌స్టాగ్రామ్‌లో చర్చ సందర్భంగా అతను ఈ విషయంపై మాట్లాడాడు. ‘నేను ముంబైని ఈ రకంగా ఎప్పుడూ చూడలేదు. మా క్రికెటర్లకు కుటుంబాలతో ఎక్కువ సమయం గడిపే సమయం దక్కదు. వరుసగా సిరీస్‌లు, పర్యటనలు ఉంటాయి. ఇప్పుడు అలాంటి అవకాశం లభించింది’ అని రోహిత్‌ పేర్కొన్నాడు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement