నాలుగు కాదు.. ఐదు: రోహిత్‌

Rohit Says Forgot Title With Deccan Chargers Will Cherish All Five - Sakshi

హైదరాబాద్‌: ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగు సార్లు ఐపీఎల్‌ విజేతగా నిలిచి చరిత్ర సృష్టించిన ముంబై ఇండియన్స్‌ ఆటగాళ్లు సంబరాల్లో మునిగితేలుతున్నారు. ముంబై సారథి రోహిత్‌ శర్మ తన భార్య, బిడ్డతో కలిసి కాసేపు సరదాగా గడిపాడు . ఇక మ్యాచ్‌ అనంతరం రోహిత్‌ శర్మ మాట్లాడాడు. ఈ సందర్భంగా నాలుగు సార్లు ఐపీఎల్‌ టోర్నీ గెలిచిన అనందం ఎలాగుందంటూ రిపోర్టర్‌ ప్రశ్నించగా.. నాలుగు కాదు, ఐదు అంటూ రోహిత్‌ సమాధనమిచ్చాడు.
ఐపీఎల్‌-2009 ట్రోఫీని గెలిచిన డెక్కన్ చార్జర్స్ జట్టులో రోహిత్‌ శర్మ సభ్యుడన్న విషయం తెలిసిందే. ఆ తర్వాత రోహిత్‌ శర్మ సారథ్యంలోనే ముంబై ఇండియన్స్‌ నాలుగు ఐపీఎల్‌ టైటిళ్లను కైవసం చేసుకుంది. ఈ క్రమంలో నాలుగు టైటిళ్లను సొంతం చేసుకున్న తొలి కెప్టెన్‌గా రోహిత్‌ నిలిచాడు. అంతేకాకుండా ఐదు ఐపీఎల్ ఫైనల్స్‌లో విజయం సాధించిన జట్టులో రోహిత్ శర్మ సభ్యుడిగా ఉండి మరో ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక ఆదివారం స్థానిక రాజీవ్‌ గాంధీ అంతర్జాతీయ మైదానంలో జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌లో ఒక్క పరుగు తేడాతో సీఎస్‌కేపై ముంబై థ్రిల్లింగ్‌ విక్టరీ సాధించి ఐపీఎల్‌-2019 ట్రోఫీని కైవసం చేసుకుంది.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top