రిషబ్‌ పంత్‌ సరికొత్త రికార్డు

Rishab Pant Most runs in An IPL Season by a Wicket Keeper  - Sakshi

న్యూఢిల్లీ : ఢిల్లీ డేర్‌డేవిల్స్‌ వికెట్‌ కీపర్‌ రిషబ్‌ పంత్‌ సరికొత్త రికార్డు నమోదు చేశాడు. ఐపీఎల్‌లో ఒక సీజన్‌లో అత్యధిక పరుగుల చేసిన వికెట్‌ కీపర్‌గా గుర్తింపు పొందాడు. ఆదివారం ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో  పంత్‌ ఈ ఘనతను సొంతం చేసుకున్నాడు. ఈ సీజన్‌లో పంత్‌ 684 పరుగులు చేశాడు. ఇప్పటి వరకు కోల్‌కతా నైట్‌రైడర్స్‌ వికెట్‌ కీపర్‌ రాబిన్‌ ఊతప్ప 660 (2014 సీజన్‌లో) పరుగుల ఈ జాబితాలో అగ్రస్థానంలో కొనసాగగా.. తాజాగా పంత్‌ అధిగమించాడు. కేఎల్‌ రాహుల్‌ 652 (2018 సీజన్‌), జోస్‌ బట్లర్‌ 548(2018), దినేశ్‌ కార్తీక్‌ 510 (2013), ఆడమ్‌ గిల్‌క్రిస్ట్‌ 492 (2009)లు ఆ తర్వాత స్థానాల్లో ఉన్నారు. ఇక ఈ సీజన్‌లోనే ముగ్గురు వికెట్‌ కీపర్‌లు( పంత్‌,రాహుల్‌, బట్లర్‌) అత్యధిక పరుగులు సాధించడం విశేషం. ఈ మ్యాచ్‌లో పంత్‌(64) హాఫ్‌ సెంచరీతో రాణించాడు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top