ఇండియా ‘ఎ’ కెప్టెన్‌గా రాయుడు | Rayudu, Unmukt to lead India 'A' and 'B' in Deodhar Trophy | Sakshi
Sakshi News home page

ఇండియా ‘ఎ’ కెప్టెన్‌గా రాయుడు

Jan 6 2016 1:33 AM | Updated on May 25 2018 7:45 PM

ఇండియా ‘ఎ’ కెప్టెన్‌గా రాయుడు - Sakshi

ఇండియా ‘ఎ’ కెప్టెన్‌గా రాయుడు

దేవధర్ ట్రోఫీలో పాల్గొనే ఇండియా ‘ఎ’ జట్టుకు అంబటి తిరుపతి రాయుడు కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు

దేవధర్ ట్రోఫీ
 న్యూఢిల్లీ: దేవధర్ ట్రోఫీలో పాల్గొనే ఇండియా ‘ఎ’ జట్టుకు అంబటి తిరుపతి రాయుడు కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. జనవరి 24 నుంచి 28 వరకు ఐదు రోజుల పాటు జరిగే ఈ టోర్నీలో ఇండియా ‘ఎ’తో పాటు ఇండియా ‘బి’, విజయ్ హజారే ట్రోఫీ చాంపియన్ గుజరాత్ జట్లు తలపడుతాయి. ఢిల్లీ క్రికెటర్ ఉన్ముక్త్ చంద్ ఇండియా ‘బి’కి సారథ్యం వహించనున్నాడు.
 
  ట్రోఫీలో ఐదు రోజుల్లో నాలుగు వన్డేలు జరుగుతాయి. రాయుడు నేతృత్వంలోని ‘ఎ’ జట్టులో మురళీ విజయ్, అమిత్ మిశ్రా, రసూల్, ఓజా, ఆరోన్ తదితరులుండగా... ‘బి’ జట్టులో రంజీ ట్రోఫీ టాప్ రన్ స్కోరర్ శ్రేయాస్ అయ్యర్‌తో పాటు షెల్డన్ జాక్సన్, కరణ్ శర్మ, మయాంక్ అగర్వాల్ లాంటి యువ ఆటగాళ్లు బరిలోకి దిగబోతున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement