వైరల్‌: అశ్విన్‌ ‘మన్కడింగ్‌’ మరో వీడియో | Sakshi
Sakshi News home page

వైరల్‌: అశ్విన్‌ ‘మన్కడింగ్‌’ మరో వీడియో

Published Tue, Mar 26 2019 7:02 PM

Ravichandran Ashwin Mankaded Sri Lanka Batsman In 2012 Video Viral - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఇండియన్‌ ప్రీమియరల్‌ లీగ్‌(ఐపీఎల్)-2019లో కింగ్స్ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు జోస్ బట్లర్ ఔట్ వివాదానికి దారి తీసింది. జోస్ బట్లర్‌ని 'మన్కడింగ్‌' ద్వారా రనౌట్ చేయడంపై కింగ్స్‌ పంజాబ్‌ సారథి రవిచంద్రన్‌ అశ్విన్‌ను అభిమానులు, మాజీ ఆటగాళ్లు ఉతికారేస్తున్నారు. జెంటిల్‌మన్‌ గేమ్‌లో అశ్విన్‌ క్రీడా స్పూర్తికి విరద్దంగా ప్రవర్తించాడని యావత్‌ క్రికెట్‌ ప్రపంచం విమర్శిస్తోంది.
(‘మన్కడింగ్‌ వద్దనుకున్నాం కదా..’)
అయితే తాజాగా గతంలో టీమిండియా - శ్రీలంక మ్యాచ్‌లో ఈ విధంగానే అశ్విన్ మన్కడింగ్ ద్వారా శ్రీలంక బ్యాట్స్‌మన్‌ను ఔట్ చేస్తే సచిన్, సెహ్వాగ్ లు చొరవతీసుకొని క్రీడాస్ఫూర్తితో అప్పీల్ ను వెనక్కి తీసుకున్న వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. క్రికెట్‌లో అత్యంత హుందాగా వ్యవహరించే దిగ్గజ ఆటగాళ్లు సచిన్, సెహ్వాగ్‌ లాంటి ఉన్నతమైన క్రీడాకారుల నుంచి కనీస స్ఫూర్తిని కూడా అశ్విన్ పొందలేదంటూ ఐపీఎల్ అభిమానులు దుమ్మెత్తిపోస్తున్నారు.


(‘అశ్విన్‌ను చూసి గర్వపడుతున్నా’) 
ఇక అశ్విన్‌ మాత్రం తను చేసిన పనిని సమర్ధించుకున్నాడు. మ్యాచ్‌ అనంతరం మాట్లాడుతూ..‘మన్కడింగ్‌ ఘటనపై అసలు చర్చే అనవసరం. అదేమీ కావాలని చేసింది కాదు. అలా జరిగిపోయిందంతే. నా బౌలింగ్‌ యాక్షన్‌ పూర్తి కాకముందే అతను క్రీజ్‌ వదిలాడు. ఈ విషయంలో నేను స్పష్టంగా ఉన్నా. ఇలాంటి చిన్న చిన్న విషయాలే మ్యాచ్‌ను మలుపు తిప్పుతాయి కాబట్టి బ్యాట్స్‌మన్‌ జాగరూకతతో ఉండటం అవసరం.’ అని అశ్విన్‌ పేర్కొన్నాడు.

చదవండి: మన్కడింగ్‌ ఔట్‌ అంటే ఏంటో తెలుసా?

Advertisement
Advertisement