ఆ వార్తలు ఆవు పేడతో సమానం: రవిశాస్త్రి

Ravi Shastri calls rumours of dating Nimrat Kaur the biggest load of cow dung - Sakshi

సౌతాంప్టన్‌: భారత క్రికెట్‌ ప్రధాన కోచ్‌ రవిశాస్త్రితో డేటింగ్‌ వార్తలను ఇప్పటికే బాలీవుడ్‌ నటి నిమ్రత్‌ కౌర్‌ ఖండించిన సంగతి తెలిసిందే. అవన్నీ గాలి వార్తలంటూ ఒక్క ముక్కలో నిమ్రత్‌ కొట్టిపారేయగా, తాజాగా రవిశాస్త్రి స్పందించాడు. అసలు ఆ వార్తలు ఎటువంటి ప్రామాణికం లేదన్న రవిశాస్త్రి.. ఇలా తప్పుడు ప్రచారం చేయడం ఆవు పేడతో సమానమంటూ ఘాటుగా బదులిచ్చాడు. ‘ ఇందులో చెప్పడానికి ఏమీ లేదు. నిమ్రత్‌తో డేటింగ్‌, ప్రేమాయణ అంటూ వార్తలు ప్రచురించారు. ఆ వార్తల్లో ఎటువంటి వాస్తవం లేదు. నా దృష్టిలో ఆ వార్త ఆవు పేడతో సమానం’ అని రవిశాస్త్రి అసహనం ప్రదర్శించాడు.

ప్రింట్‌ మోడల్‌గా కెరీర్‌ను ఆరంభించిన నిమ్రత్‌ కౌర్‌.. మ్యూజిక్ వీడియోల ద్వారా పాపులర్ అయ్యారు. అలాగే పలు బాలీవుడ్ సినిమాల్లో నటించారు. పలు అవార్డులు సొంతం చేసుకున్న ‘లంచ్ బాక్స్’ మూవీలో నటించారామె.  ప్రస్తుతం రవిశాస్త్రితో డేటింగ్ వార్తలతో ఆమె మళ్లీ హాట్‌ టాపిక్‌ అయ్యారు. నిమ్రత్‌తో రవిశాస్త్రి డేటింగ్‌ చేస్తున్నట్లు ముంబై మిర్రర్‌ ఓ కథనంలో పేర్కొంది. ప్రముఖ కార్ల కంపెనీ ‘ఆడి’కి సంయుక్తంగా బ్రాండ్‌ అంబాసిడర్లుగా వ్యవహరిస్తున్న వీరిద్దరూ.. ఈ కారు ప్రచార కార్యక్రమంలో భాగంగా కలిసినప్పుడు ప‍్రేమలో పడ్డారని తెలిపింది. ఆ క్రమంలోనే ఈ జంట గత కొంతకాలంగా డేటింగ్‌ చేస్తున్నట్లు తన వార్తలో స్పష్టం చేసింది.

రవిశాస్త్రితో డేటింగ్‌.. స్పందించిన నటి

రవిశాస్త్రి మళ్లీ ప్రేమలో పడ్డాడా?

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top