రవిశాస్త్రి మళ్లీ ప్రేమలో పడ్డాడా?

Is Nimrat Kaur dating Indian cricket team coach Ravi Shastri? - Sakshi

సౌతాంప్టన్‌: ఒకవైపు ఇంగ్లండ్‌లో టెస్టు సిరీస్‌ను టీమిండియా కోల్పోయి భారీ స్థాయిలో విమర్శలను ఎదుర్కొంటుంటే, ప్రధాన కోచ్‌ రవిశాస్త్రి మాత్రం ‘కొత్త ప్రేమాయణం’ వార్తల్లో నిలిచాడు. ప్రముఖ నటి నిమ్రత్‌ కౌర్‌తో రవిశాస్త్రి డేటింగ్ చేస్తున్నట్టుగా సమాచారం.  ప్రస్తుతం ఆమె కూడా ఇంగ్లండ్‌లోనే ఉంది. వీరిద్దరూ తరచూ కలుస్తున్నారని.. ప్రేమలో మునిగి తేలుతున్నట్లు తెలుస్తోంది.

ప్రింట్‌ మోడల్ గా కెరీర్ ను ఆరంభించిన నిమ్రత్‌ కౌర్‌.. మ్యూజిక్ వీడియోల ద్వారా పాపులర్ అయ్యింది. అలాగే పలు బాలీవుడ్ సినిమాల్లో నటించింది. పలు అవార్డులు పొందిన ‘లంచ్ బాక్స్’ మూవీలో నటించిందామె. ఇప్పుడు రవిశాస్త్రితో డేటింగ్ వార్తలతో ఈమె పేరు వినిపిస్తోంది. ప్రస్తుతం రవిశాస్త్రి వయసు 56 సంవత్సరాలు. నిమ్రత్ వయసు 36. వీళ్లిద్దరూ రెండేళ్లుగా పరిచయస్తులని తెలుస్తోంది. ఒక ప‍్రమోషన్‌ కార‍్యక్రమంలో వీరిద్దరి మధ్య ఏర్పడిన పరిచయం కాస్తా ప్రేమగా చిగురించిందని తెలుస్తోంది.

రవిశాస్త్రికి గతంలోనే పెళ్లి అయ్యింది. సంతానం కూడా ఉంది. అయితే గత కొన్నేళ్లుగా భార్య రితూ సింగ్‌కు రవిశాస్త్రి దూరంగా ఉంటున్నట్లు తెలుస్తోంది. ఈ క‍్రమంలోనే కొన్నేళ్ల కిందట రవిశాస్త్రి విడాకుల వార్తలు వచ్చాయి. ఇప్పుడు కొత్త ప్రేమాయణ రూమర్లు వినిపిస్తున్నాయి. 1980 ప్రాంతంలో బాలీవుడ్‌ నటి అమ్రితా సింగ్‌తో డేటింగ్‌ చేసిన రవిశాస్త్రిపై తాజాగా ప్రేమ, డేటింగ్‌ అంటూ వార్తల రావడం హాట్‌ టాపిక్‌గా మారింది.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top