రవిశాస్త్రితో డేటింగ్‌.. స్పందించిన నటి | Nimrat Kaur Breaks Her Silence on Dating Rumours with Indian Coach | Sakshi
Sakshi News home page

Sep 4 2018 9:23 AM | Updated on Sep 4 2018 9:40 AM

Nimrat Kaur Breaks Her Silence on Dating Rumours with Indian Coach - Sakshi

నిమ్రత్‌ కౌర్‌

ముంబై : టీమిండియా హెడ్‌ కోచ్‌ రవిశాస్త్రి, బాలీవుడ్‌ నటి నిమ్రత్‌ కౌర్‌తో రహస్యంగా డేటింగ్‌ చేస్తున్నాడనే వార్తలు హల్‌చల్‌ చేస్తున్న విషయం తెలిసిందే. గత రెండేళ్లుగా వీరి ప్రేమాయణం సాగుతుందని, ప్రముఖ కార్ల కంపెనీ ‘ఆడీ’ ప్రచార కార్యక్రమంలో భాగంగా కలిసినప్పుడు మొదలైన ప్రేమే మరింత గాఢంగా మారిందని సోషల్‌మీడియా కోడై కూస్తోంది. అయితే ఇవన్నీ గాలివార్తలని నిమ్రత్‌ కౌర్‌ ఒక్క ట్వీట్‌తో కొట్టి పారేసారు. మీడియాలో వచ్చిన కథనాలు చూసి ఆమె సాయంత్రం ట్విటర్‌లో స్పందించారు. తనకు రూట్‌ కెనాల్‌ అవసరమైతదేమోనని అనిపిస్తుందని, తన గురించి  వచ్చిన వార్తలు చదివానని, అవి చాలా బాధపెట్టాయని తెలుపుతూ.. ఇదంతా ట్రాష్‌ అని ఆ వార్తలను కొట్టిపారేశారు.

ప్రింట్‌ మోడల్గా కెరీర్ను ఆరంభించిన నిమ్రత్‌ కౌర్‌.. మ్యూజిక్ వీడియోల ద్వారా పాపులర్ అయ్యారు. అలాగే పలు బాలీవుడ్ సినిమాల్లో నటించారు. పలు అవార్డులు సొంతం చేసుకున్న ‘లంచ్ బాక్స్’ మూవీలో నటించారామె. ప్రస్తుతం రవిశాస్త్రితో డేటింగ్ వార్తలతో ఆమె మళ్లీ హాట్‌ టాపిక్‌ అయ్యారు. రవిశాస్త్రి వయసు 56 సంవత్సరాలు కాగా.. నిమ్రత్ వయసు 36. రవిశాస్త్రికి గతంలోనే పెళ్లి అయ్యింది. సంతానం కూడా ఉంది. అయితే గత కొన్నేళ్లుగా భార్య రితూ సింగ్‌కు రవిశాస్త్రి దూరంగా ఉంటున్నట్లు తెలుస్తోంది. ఈ క‍్రమంలోనే కొన్నేళ్ల కిందట రవిశాస్త్రి విడాకుల వార్తలు వినిపించాయి.

చదవండి: రవిశాస్త్రి మళ్లీ ప్రేమలో పడ్డాడా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement