మాకు ఆశ‍్చర్యం కల‍్గించలేదు: యూసఫ్‌ పఠాన్‌ | Rashid blitz was not a surprise, Yusuf Pathan | Sakshi
Sakshi News home page

మాకు ఆశ‍్చర్యం కల‍్గించలేదు: యూసఫ్‌ పఠాన్‌

May 26 2018 1:35 PM | Updated on May 26 2018 1:36 PM

Rashid blitz was not a surprise, Yusuf Pathan - Sakshi

కోల్‌కతా: ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన క్వాలిఫయర్‌-2 మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద​ ఆటగాడు రషీద్‌ ఖాన్‌ బ్యాట్‌తో చెలరేగడం ప్రతీ ఒక్కర్నీ ఆశ్చర్యానికి గురి చేసిన సంగతి తెలిసిందే. అయితే రషీద్‌ ఖాన్‌ బ్యాట్‌ను ఝుళిపించడం సన్‌రైజర్స్‌ శిబిరాన్ని ఎంతమాత‍్రం ఆశ్చర్యపరచలేదని అంటున్నాడు వెటరన్‌ క్రికెటర్‌ యూసఫ్‌ పఠాన్‌.

‘రషీద్‌ బ్యాట్‌తో మెరుపులు మెరిపించడం మమ్మల్ని ఆశ్చర్య పరచలేదు. అతను చాలా సందర్భాల్లో సిక్సర్లు, బౌండరీలతో విరుచుకుపడ్డాడు. ప్రధానంగా బిగ్‌బాష్‌ లీగ్‌తో పాటు మిగతా ఫ్రాంచైజీలకు ఆడేటప్పుడు కూడా రషీద్‌ బ్యాట్‌ అలరించిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అతని సామర్థ్యంపై మాకు నమ్మకం ఉంది.  అందుకే అతన్ని ఒక స్థానం ముందుకు ప‍్రమోట్‌ చేశాం.  సన్‌రైజర్స్‌ పెట్టుకున్న నమ్మకాన్ని రషీద్‌ నిలబెట్టాడు. రేపు రెండు అత్యుత్తమ జట్ల మధ్య టైటిల్‌ పోరు జరుగనుంది. ఇందులో ఎవరైతే ఉత్తమ ప్రదర్శన కనబరుస్తారో వారిదే విజయం’ అని యూసఫ్‌ పేర్కొన్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement