రంజీ ట్రోఫీ చరిత్రలో కేరళ తొలిసారిగా..

Ranji Trophy 2019 Kerala Cricket Team Makes Maiden Semi Final - Sakshi

తిరువనంతపురం: కేరళ క్రికెట్‌ జట్టు సరికొత్త చరిత్ర సృష్టించింది. రంజీ ట్రోఫీ చరిత్రలోనే కేరళ జట్టు తొలిసారి సెమిఫైనల్‌కు చేరింది. ఇప్పటివరకు ఆజట్టు క్వార్టర్‌ ఫైనల్‌ వరకు చేరడమే అత్యుత్తమం. గురువారం గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో కేరళ జట్టు 113 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 195 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్‌ జట్టును కేరళ బౌలర్లు బెంబేలెత్తించారు. కేరళ బౌలర్లు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ బసిల్‌ థంపి(5/27), సందీ వారియర్(4/30)లు చెలరేగడంతో గుజరాత్‌ జట్టు తమ రెండో ఇన్నింగ్స్‌లో 31.3 ఓవర్లకు 81 పరుగులకే ఆలౌటైంది.  గుజరాత్‌ తమ చివరి 6 వికెట్లను 24 పరుగుల వ్యవధిలోనే కోల్పోవడం గమనార్హం. 

కేరళ : 185/9, 171 ఆలౌట్‌
గుజరాత్‌: 162 ఆలౌట్‌, 81 ఆలౌట్‌

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top