చాంపియన్‌ రామకృష్ణ | ramakrishna wins fide chess title | Sakshi
Sakshi News home page

చాంపియన్‌ రామకృష్ణ

Jul 24 2017 10:35 AM | Updated on Sep 5 2017 4:47 PM

చాంపియన్‌ రామకృష్ణ

చాంపియన్‌ రామకృష్ణ

ఆలిండియా ఫిడే రేటింగ్‌ చెస్‌ టోర్నమెంట్‌లో జె. రామకృష్ణ (ఆంధ్రాబ్యాంక్‌) సత్తా చాటాడు.

ఆలిండియా ఫిడే రేటింగ్‌ చెస్‌ టోర్నమెంట్‌


సాక్షి, హైదరాబాద్‌: ఆలిండియా ఫిడే రేటింగ్‌ చెస్‌ టోర్నమెంట్‌లో జె. రామకృష్ణ (ఆంధ్రాబ్యాంక్‌) సత్తా చాటాడు. ఆంధ్రప్రదేశ్‌లోని భీమవరంలో జరిగిన ఈ టోర్నీలో విజేతగా నిలిచి టైటిల్‌ను కైవసం చేసుకున్నాడు. నిర్ణీత 10 రౌండ్లలో 9.5 పాయింట్లు స్కోర్‌ చేసి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. చివరిదైన పదో గేమ్‌లో రామకృష్ణ, అజయ్‌ (ఏపీ)పై విజయం సాధించాడు.

 

ఈ టోర్నీలో 8 పాయింట్లతో తరుణ్, జె. మల్లేశ్వర రావు (ఏపీ), కేఎన్‌ గోపాల్‌ (ఆంధ్రాబ్యాంక్‌) సంయుక్తంగా రెండో స్థానం కోసం పోటీపడ్డారు. అయితే మెరుగైన టైబ్రేక్‌ స్కోరు ఆధారంగా తరుణ్, మల్లేశ్వర రావు వరుసగా రెండు, మూడు స్థానాలను దక్కించుకున్నారు.

 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement