‘యుద్ధం మధ్యలో ఆడగలమా’ | Koneru Humpy withdraws from Women Candidates, cites safety concerns | Sakshi
Sakshi News home page

‘యుద్ధం మధ్యలో ఆడగలమా’

Mar 24 2026 5:39 AM | Updated on Mar 24 2026 5:39 AM

Koneru Humpy withdraws from Women Candidates, cites safety concerns

కోనేరు హంపి సూటి ప్రశ్న

‘క్యాండిడేట్స్‌’ నుంచి తప్పుకోవడంపై స్పందన 

జరిమానాను పట్టించుకోనని స్పష్టీకరణ  

న్యూఢిల్లీ: ‘ఫిడే’ మహిళల క్యాండిడేట్స్‌ టోర్నీ నుంచి తప్పుకోవాలనే నిర్ణయాన్ని హడావిడిగా తీసుకోలేదని భారత స్టార్‌ చెస్‌ క్రీడాకారిణి కోనేరు హంపి పేర్కొంది. ఎన్నో రకాలుగా ఆలోచించిన తర్వాతే ఈ నిర్ణయానికి వచ్చినట్లు ఆమె వ్యాఖ్యానించింది. ఈనెల 29 నుంచి సైప్రస్‌లో జరిగే ఈ పోటీల్లో తమకు అందించే భద్రతపై సందేహం 
ఉండటం వల్లే దూరమైనట్లు హంపి స్పష్టం చేసింది. 

మధ్యధరా సముద్రంలోని సైప్రస్‌... ప్రస్తుతం అమెరికా–ఇరాన్‌ మధ్య సాగుతున్న యుద్ధ క్షేత్రాలకు అతి సమీపంలో ఉంది. ఒకవైపు తమకు సమీపంలో యుద్ధం జరుగుతుంటే మరోవైపు ఆటలు ఎలా ఆడగలమని హంపి సూటిగా ప్రశి్నంచింది. ‘మన చుట్టూ యుద్ధం సాగుతుంటే, యుద్ధ నౌకలు మీకు సమీపంలోనే కనిపిస్తుంటే ఒక విదేశీయురాలైన నేను, పైగా మహిళను అంత దూరం ప్రయాణించి ప్రశాంతంగా ఎలా ఆడగలను. సైప్రస్‌కు చాలా దగ్గరలో ఉన్న లెబనాన్‌లో బాంబులు పడుతున్నాయి. 

స్వయంగా సైప్రస్‌ అధ్యక్షుడే ఇటీవల తమ పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేశారు. అలాంటిది ఒక  ప్లేయర్‌గా నేను జాగ్రత్తపడితే తప్పేంటి. అయినా వారు సైప్రస్‌లో కాకుండా ప్రపంచంలో ఎక్కడైనా టోర్నీని నిర్వహించగలిగేవారు. లేదా అక్కడే జరపాలంటే ఒక నెల రోజుల పాటు పరిస్థితులు చక్కబడే వరకు ఆగాల్సింది. నేను హడావిడిగా ఈ నిర్ణయం తీసుకోలేదు. నా ప్రొఫెషన్, వ్యక్తిగత భద్రత, ఇలాంటి స్థితిలో నా ఆట ఎలా ఉంటుందో ఎన్నో రాత్రులు ఆలోచించిన తర్వాత ఇక్కడి దాకా వచ్చాను’ అని హంపి వ్యాఖ్యానించింది.  

జమ్ము కశ్మీర్‌లో నిర్వహిస్తారా! 
టోరీ్నలో పాల్గొనాల్సిన 16 మందిలో 15 మందికి సమస్య లేదని, తాను మాత్రమే తప్పుకున్నానని కొందరు విమర్శలు చేస్తుండటంపై కూడా హంపి స్పందించింది. ‘మిగతా వారంతా ఆడుతున్నారంటే నిర్వాహకులు సరైన నిర్ణయం తీసుకున్నారని అర్థం కాదు. ఎలాంటి అడ్డంకులు లేకుండా టోర్నీ జరగవచ్చు కూడా. కానీ ఇలాంటి కఠిన పరిస్థితుల్లో నిర్వహించడం అవసరమా అనేదే నా ప్రశ్న. 

భద్రతకు సంబంధించి అమెరికా, ఇంగ్లండ్‌లు ఇప్పటికే లెవల్‌ 3 స్థాయి హెచ్చరికలు జారీ చేశాయి. ఇదే స్థాయిలో భద్రతా వ్యవస్థ ఉన్న జమ్ము కశ్మీర్‌లో వారు టోర్నీ నిర్వహిస్తారా? చాలా అందమైన రిసార్ట్‌లో టోర్నీ నిర్వహిస్తున్నామని వారు చెబుతున్నారు. అలాంటివి భారత దేశంలోనూ చాలా ఉన్నాయి. ఒక టోర్నీ ఆడేందుకు ఇలాంటి ఏర్పాట్లు మాత్రమే సరిపోవు. అనుకూలమైన పరిస్థితులు కూడా ఉండాలి. నేను ఇప్పుడు వెళ్లి ఆడటం అంటే నిర్వాహకుల నిర్ణయానికి మద్దతిచ్చినట్లే. నిజానికి యుద్ధం మొదలు కాగానే ఆటగాళ్ల వ్యక్తిగత అభిప్రాయాలను నిర్వాహకులు అడగాల్సింది’ అని హంపి పేర్కొంది.  

డబ్బు కోసం ఆడటం లేదు... 
క్యాండిడేట్స్‌ టోర్నీ నుంచి చివరి నిమిషంలో తప్పుకోవడంతో హంపిపై ‘ఫిడే’ భారీ జరిమానా విధించే అవకాశం ఉంది. అయితే తాను దీనిని పట్టించుకోనని ఆమె స్పష్టం చేసింది. ‘ఆటగాళ్లు నిజాలు మాట్లాడకూడదనే ‘ఫిడే’ జరిమానాలతో భయపెడుతుంది. నాకు ఎలాంటి భయం లేదు. డబ్బు కోసం, ఇతర వాణిజ్య లాభాల కోసం నేను ఆడటం లేదు. చెస్‌ అంటే ఇష్టంతో ఆడుతున్నాను. ఫిడే ఉపాధ్యక్షుడు విశ్వనాథన్‌ ఆనంద్‌తో కూడా ఈ టోర్నీ విషయంలో మాట్లాడాను. 

అయితే ఆ విషయాలు నేను బయటకు చెప్పను. టోరీ్నలో ఆడుతున్న భారత సహచరులు దివ్య, వైశాలి, ప్రజ్ఞానందలతో నేను మాట్లాడలేదు. ఆ అవసరం లేదు. ఎవరి ఇష్టం వారిది. నేను కూడా నా కోసం మాట్లాడతాను తప్ప వేరేవాళ్ల గురించి కాదు’ అని హంపి పదునైన వ్యాఖ్యలు చేసింది. సైప్రస్‌లో తాజా పరిస్థితులపై అమెరికా గ్రాండ్‌మాస్టర్‌ నకమురా కూడా ఆందోళన వ్యక్తం చేశాడు. మరోవైపు హంపి స్థానంలో ఉక్రెయిన్‌కు చెందిన అనా ముజీచుక్‌ను టోరీ్నలో ఆడేందుకు ఎంపిక చేసినట్లు ‘ఫిడే’ ప్రకటించింది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement