ఐపీఎల్ మ్యాచ్ లు తరలించం: శుక్లా | Rajeev Shukla Rules Out Shifting Indian Premier League Matches Out of Maharashtra | Sakshi
Sakshi News home page

ఐపీఎల్ మ్యాచ్ లు తరలించం: శుక్లా

Apr 5 2016 11:48 PM | Updated on Sep 3 2017 9:16 PM

మహారాష్ట్రలో జరిగే ఐపీఎల్ మ్యాచ్‌లను ఇతర చోట్లకు తరలించేది లేదని లీగ్ చైర్మన్ రాజీవ్ శుక్లా తేల్చి చెప్పారు.

ముంబై: మహారాష్ట్రలో జరిగే ఐపీఎల్ మ్యాచ్‌లను ఇతర చోట్లకు తరలించేది లేదని లీగ్ చైర్మన్ రాజీవ్ శుక్లా తేల్చి చెప్పారు. కరవుతో పాటు నీటి కొరత కారణంగా ముంబై, పుణేల్లో ఐపీఎల్ మ్యాచ్‌లను నిర్వహించకూడదని ఇటీవల నిరసనలు వ్యక్తమమయ్యాయి. ‘కరవు, నీటి సమస్య పరిష్కారానికి మహారాష్ట్ర ప్రభుత్వం ఏదైనా ప్రతిపాదన తెస్తే అన్ని విధాలా సహకరించేందుకు మేం సిద్ధంగా ఉన్నాం. మేం రైతుల పక్షానే ఉన్నాం’ అని శుక్లా తెలిపారు.

 అభిమానులూ థర్డ్ అంపైర్లే
ఐపీఎల్-9లో థర్డ్ అంపైర్ తీసుకునే కీలక నిర్ణయాల్లో అభిమానులు పాలు పంచుకోనున్నారు. ఈ మేరకు ఐపీఎల్ చైర్మన్ రాజీవ్ శుక్లా ప్రేక్షకుల్ని ఆటలో భాగం చేయడానికి కొత్త విధానాన్ని తీసుకువచ్చారు. ‘ఈ విధానం ప్రకారం ఆటగాళ్ల ఔట్‌ను ప్రకటించే విషయంలో అభిమానులు థర్డ్ అంపైర్‌కు సూచనలు, సలహాలు ఇవ్వవచ్చు. స్టేడియంలో ఉన్న అభిమానులు తమ నిర్ణయాన్ని ప్లకార్డుపై రాసి చూపించవచ్చు. ఈ ప్లకార్డులను స్కీన్‌లపై ప్రదర్శిస్తారు.  కానీ ఆటగాడు ఔటయ్యాడా? లేదా? అనేది చివరకు థర్డ్ అంపైర్ మాత్రమే నిర్ణయిస్తారు’ అని శుక్లా పేర్కొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement