ఐపీఎల్-7లో రాజస్థాన్ రాయల్స్ శుభారంభం చేసింది. శుక్రవారం జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ నాలుగు వికెట్లతో సన్ రైజర్స్ హైదరాబాద్పై విజయం సాధించింది.
అబుదాబి: ఐపీఎల్-7లో రాజస్థాన్ రాయల్స్ శుభారంభం చేసింది. శుక్రవారం జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ నాలుగు వికెట్లతో సన్ రైజర్స్ హైదరాబాద్పై విజయం సాధించింది. 134 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ ఆరు వికెట్లు కోల్పోయి మరో మూడు బంతులు మిగిలుండగా విజయతీరాలకు చేరింది. రహానె (59), స్టువర్ట్ బిన్నీ (48 నాటౌట్) రాణించారు. స్టెయిన్, అమిత్ మిశ్రా రెండేసి వికెట్లు తీశారు.
అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన హైదరాబాద్ నిర్ణీత ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 133 పరుగులు చేసింది. ధవన్ 38, వార్నర్ 32, లోకేష్ రాహుల్ 20 పరుగులు చేశారు. ధవల్ కులకర్ణి, రిచర్డ్సన్, రజత్ భాటియా రెండేసి వికెట్లు తీశారు.