వర్షంలోనే దూసుకెళ్లిన గేల్‌ సిక్స్‌.! | Rain Stopped KXIP VS KKR Match | Sakshi
Sakshi News home page

Apr 21 2018 6:58 PM | Updated on Apr 21 2018 7:44 PM

Rain Stopped KXIP VS KKR Match - Sakshi

కోల్‌కతా : కింగ్స్‌ పంజాబ్‌, కోల్‌కతా నైట్‌రైడర్స్‌ల మధ్య జరుగుతున్న మ్యాచ్‌కు వర్షం అడ్డంకిగా మారింది. 192 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కింగ్స్‌ పంజాబ్‌కు ఓపెనర్లు క్రిస్‌గేల్‌, కేఎల్‌ రాహుల్‌లు మంచి శుభారంబాన్ని అందించారు. 8.2 ఓవర్లు సాగిన ఆటలో పంజాబ్‌ వికెట్‌ నష్టపోకుండా 96 పరుగులు చేసింది. విధ్వంసకర బ్యాట్స్‌మన్‌ గేల్‌ మరోసారి అర్థసెంచరీకి చేరువయ్యాడు. 27 బంతుల్లో 5 ఫోర్లు 4 సిక్సులతో 49 పరుగులు చేశాడు. మరో ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌ 23 బంతుల్లో 7 ఫోర్లు 1 సిక్సుతో 43 పరుగులు పూర్తి చేసుకున్నాడు. చావ్లా వేసిన 9 ఓవర్‌ రెండో బంతిని గేల్‌ భారీ షాట్‌ ఆడాడు. ఇక బంతి గాల్లో ఉండగానే వర్షం ప్రారంభమైంది. విచిత్రంగా గేల్‌ సిక్సుకే వర్షం వచ్చినట్లైంది. దీంతో అంపైర్లు మ్యాచ్‌ను నిలిపి వేశారు.

Advertisement
 
Advertisement
Advertisement