ఉప్పల్ లో భారీ వర్షం, మ్యాచ్ ఆలస్యం | Rain Interrupt SH, RCB Match in Hyderabad | Sakshi
Sakshi News home page

ఉప్పల్ లో భారీ వర్షం, మ్యాచ్ ఆలస్యం

May 15 2015 7:53 PM | Updated on Sep 3 2017 2:06 AM

ఉప్పల్ లో భారీ వర్షం, మ్యాచ్ ఆలస్యం

ఉప్పల్ లో భారీ వర్షం, మ్యాచ్ ఆలస్యం

సన్ రైజర్స్ హైదరాబాద్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్ కు వర్షం అడ్డంకిగా నిలిచింది.

హైదరాబాద్:  సన్ రైజర్స్ హైదరాబాద్,  రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్ కు వర్షం అడ్డంకిగా నిలిచింది. టాస్ వేసిన తర్వాత భారీ వర్షం ప్రారంభమైంది. దీంతో మ్యాచ్ ఆలస్యంగా ప్రారంభమయ్యే అవకాశముంది. పిచ్ తడవకుండా కవర్లు కప్పివుంచారు. వర్షం ఇంకా కురుస్తూనే ఉంది. ఉప్పల్ మైదానంలోకి వర్షం నీరు చేరింది. మ్యాచ్ ను  ప్రత్యక్షంగా తిలకించేందుకు వచ్చిన అభిమానులు తడిసి ముద్దయ్యారు.

వర్షం తగ్గితేనే మ్యాచ్ ప్రారంభమవుతుంది. వర్షం ఆగిన తర్వాత మైదానం ఆరేందుకు ఎక్కువ సమయం పట్టేట్టు కనబడుతోంది. కాగా పూర్తి ఓవర్లు మ్యాచ్ జరగాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఎక్కువసేపు వర్షం కురిస్తే మ్యాచ్ ను కుదించే అవకాశముంది. ఒకవేళ మ్యాచ్ రద్దయితే ఇరు జట్లకు చెరో పాయింట్ లభిస్తుంది. టాస్ గెలిచిన హైదరాబాద్ బ్యాటింగ్ ఎంచుకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement