‘టెస్టు క్రికెట్ అనేది ఓ మహా వృక్షం’ | rahul dravid backs day-night Test cricket | Sakshi
Sakshi News home page

‘టెస్టు క్రికెట్ అనేది ఓ మహా వృక్షం’

Aug 20 2013 7:34 PM | Updated on Sep 1 2017 9:56 PM

‘టెస్టు క్రికెట్ అనేది ఓ మహా వృక్షం’

‘టెస్టు క్రికెట్ అనేది ఓ మహా వృక్షం’

వన్డే, టి20 ఫార్మాట్ నుంచి సంప్రదాయక టెస్టు క్రికెట్‌ను కాపాడుకునేందుకు భారత మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ పలు సూచనలు చేశాడు.

లండన్: టెస్టు క్రికెట్ అనేది మహా వృక్షం లాంటిది. వన్డే అయినా టి20 అయినా వీటి కొమ్మలుగానే చెప్పుకోవచ్చని భారత మాజీ కెప్టెన్ ద్రవిడ్ అభిప్రాయపడ్డాడు. వన్డే, టి20 ఫార్మాట్ నుంచి సంప్రదాయక టెస్టు క్రికెట్‌ను కాపాడుకునేందుకు  పలు సూచనలు చేశాడు. దీంట్లో భాగంగా పింక్ కలర్ బంతులతో డే అండ్ నైట్ టెస్టులు ఆడించాలని చెప్పాడు. టి20, టెస్టులకు మధ్య ఫాస్ట్ ఫుడ్, రుచికరమైన భోజనానికి ఉన్న తేడా ఉందని అన్నాడు.

 

'టెస్టు క్రికెట్ అనేది మహా వృక్షం లాంటిది. వన్డే అయినా టి20 అయినా వీటి కొమ్మలుగానే చెప్పుకోవచ్చు. వాస్తవానికి ఫలాలను ఆ కొమ్మలే మోస్తున్నాయి. అందరికీ ఫలాలు కనిపిస్తున్నా వాటిని మోస్తున్న చెట్టు సంగతి మరువరాదు. కొమ్మలకు కానీ ఫలాలకు కానీ ఇదే జీవన వనరు. దాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. చెట్టును నరికేస్తే ఇంకేమీ ఉండవు. అందుకే టెస్టులను మనం కాపాడుకోవాలి’ అని ద్రవిడ్ వివరించాడు.
 

Advertisement
 
Advertisement
Advertisement