రాగ వర్షిణికి రెండు స్వర్ణాలు | Raga Varshini Got Two Gold Medals In Athletics Championship | Sakshi
Sakshi News home page

రాగ వర్షిణికి రెండు స్వర్ణాలు

Oct 21 2019 10:02 AM | Updated on Oct 21 2019 10:02 AM

Raga Varshini Got Two Gold Medals In Athletics Championship - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌ జిల్లా అథ్లెటిక్స్‌ సంఘం ఆధ్వర్యంలో జరిగిన జిల్లా స్థాయి అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌లో సెయింట్‌ జోసెఫ్‌ (కింగ్‌కోఠి)కు చెందిన రాగ వర్షిణి సత్తా చాటింది. గచ్చిబౌలి స్టేడియంలో జరిగిన ఈ టోర్నీలో అండర్‌–16 బాలికల 100, 200 మీటర్ల విభాగాల్లో విజేతగా నిలిచి రెండు పసిడి పతకాలను హస్తగతం చేసుకుంది. 100 మీ. పరుగును రాగ వర్షిణి అందరి కన్నా ముందుగా 13.0 సెకన్లలోనే పూర్తిచేసి చాంపియన్‌గా నిలిచింది. అలీషా (సెయింట్‌ ఆండ్రూస్‌; 13.4సె.), జోషిత (సెయింట్‌ జోసెఫ్‌; 14.1సె.) వరుసగా రజత, కాంస్య పతకాలను గెలుచుకున్నారు. 200 మీ. పరుగును రాగ వర్షిణి 28.0 సెకన్లలో ముగించి అగ్రస్థానాన్ని అందుకుంది.

29.3 సెకన్ల టైమింగ్‌ నమోదు చేసిన అలీషా రెండో స్థానంలో నిలవగా, రితికా రెడ్డి (30.9సె.) మూడో స్థానాన్ని అందుకుంది. 400 మీ. పరుగులో పి. శ్రీయ (శ్రీ గాయత్రి జూ. కాలేజి; 1ని.05.9సె.), స్నేహా కుమార్‌ (సెయింట్‌ ఆండ్రూస్‌; 1ని.09.5సె.), నిధి (సెయింట్‌ జోసెఫ్‌; 1ని.11.4సె.) వరుసగా స్వర్ణ, రజత, కాంస్య పతకాలను సొంతం చేసుకున్నారు. పోటీల అనంతరం జరిగిన బహుమతి ప్రదాన కార్యక్రమంలో హైదరాబాద్‌ జిల్లా అథ్లెటిక్స్‌ సంఘం (హెచ్‌డీఏఏ) ఉపాధ్యక్షుడు ఆల్బర్ట్‌ జేవియర్‌ ముఖ్య అతిథిగా విచ్చేసి విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో హెచ్‌డీఏఏ కార్యదర్శి భాస్కర్‌ రెడ్డి, కార్యనిర్వాహక కార్యదర్శి  చిస్తీ తదితరులు పాల్గొన్నారు.  

ఇతర ఈవెంట్‌ల విజేతల వివరాలు

∙ అండర్‌–16 బాలికల 1000 మీ. పరుగు: 1. పి. శ్రీయ, 2. స్నేహా, 3. షర్మిష్ట; బాలురు: 1. మొహమ్మద్‌ అలీ, 2. యు«ద్‌వీర్‌ సింగ్, 3. సాయి.  
∙ లాంగ్‌జంప్‌ బాలికలు: 1. సత్యశ్రీ ఆశ్రిత, 2. ఆకాంక్ష, 3. ప్రసన్న; బాలురు: 1. అన్‌మోల్‌ రాణా, 2. కె. హర్షవర్ధన్, 3. పి. శ్రీకాంత్‌.  
∙ షాట్‌పుట్‌ బాలికలు: 1. అదితి సింగ్, 2. శేష సాయి, 3. భవిష్య; బాలురు: 1. రాహుల్‌ గౌడ్‌.   

∙ డిస్కస్‌ త్రో బాలికలు: 1. సుప్రజ.  
∙ 100 మీ. పరుగు బాలురు: 1. టి. రాహుల్, 2. ఎ. రేవంత్, 3. ఆర్‌. సాయి కుమార్‌.
∙ 200 మీ. పరుగు బాలురు: 1. టి. రాహుల్, 2.  రేవంత్, 3. మణిహర్షిత్‌.
∙ 400 మీ. పరుగు బాలురు: 1. ఎం. సాయి, 2. వాయునందన్, 3. వినయ్‌ కుమార్‌.  
∙ అండర్‌–14 బాలుర 100మీ. పరుగు: 1. హర్షవర్ధన్, 2. అనిరుధ్‌ బోస్, 3. గణేశ్‌; బాలికలు: 1. కృతి, 2. జి. ప్రీతి, 3. స్నేహా.
∙ 600 మీ. పరుగు: 1. వి. వివేక్, 2. బద్రి, 3. విశాల్‌; బాలికలు: 1. ఝాన్సీబాయి, 2. యువిక, 3. సంజన.
∙ లాంగ్‌ జంప్‌: 1. ఎన్‌. కార్తీక్, 2. ఆర్యన్‌ కుమార్, 3. గణేశ్‌; బాలికలు: 1. ఖుష్బు, 2. సంజన, 3. మహేశ్వరి.  
∙ షాట్‌పుట్‌: 1. ఎన్‌. గణేశ్, 2. అనుజ్ఞ రాకేశ్, 3. అమిత్‌ కుమార్‌; బాలికలు: 1. సాయి శ్రీయ, 2. మనస్విని, 3. మనస్విత.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement