కింగ్స్ పంజాబ్ కెప్టెన్సీ మార్పు | Punjab replace captain Miller with Vijay | Sakshi
Sakshi News home page

కింగ్స్ పంజాబ్ కెప్టెన్సీ మార్పు

Apr 30 2016 6:39 PM | Updated on Sep 3 2017 11:07 PM

కింగ్స్ పంజాబ్ కెప్టెన్సీ మార్పు

కింగ్స్ పంజాబ్ కెప్టెన్సీ మార్పు

ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-9వ సీజన్లో పేలవ ప్రదర్శనతో ప్రస్తుతం అట్టడుగు స్థానంలో ఉన్న కింగ్స్ పంజాబ్ కెప్టెన్సీ పదవి నుంచి డేవిడ్ మిల్లర్ను తొలగించారు.

మొహాలి: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-9వ సీజన్లో పేలవ ప్రదర్శనతో ప్రస్తుతం అట్టడుగు స్థానంలో ఉన్న కింగ్స్ పంజాబ్ కెప్టెన్సీ పదవి నుంచి డేవిడ్ మిల్లర్ను తొలగించారు. అతని స్థానంలో మురళీ విజయ్ కు జట్టు పగ్గాలు అప్పజెప్పుతూ కింగ్స్ పంజాబ్ యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు  కింగ్స్ పంజాబ్ శనివారం ఓ ప్రకటన విడుదల చేసింది. 'డేవిడ్ మిల్లర్ కెప్టెన్ గా విఫలమైన కారణంగా ఆ బాధ్యతను మురళీ విజయ్ కు అప్పగిస్తున్నాం. కెప్టెన్సీ భారం వల్ల మిల్లర్ ఆటగాడిగా కూడా సఫలం కావడం లేదు.  ఇక నుంచి మిల్లర్ జట్టులో సభ్యుడిగా  మాత్రమే కొనసాగుతాడు' అని కింగ్స్ పంజాబ్ ఫ్రాంచైజీ స్పష్టం చేసింది.

ఈ టోర్నీలో ఇప్పటివరకూ ఆరు మ్యాచ్లు ఆడిన పంజాబ్ కేవలం ఒకదాంట్లో మాత్రమే విజయం సాధించి పాయింట్ల పట్టికలో వెనుకబడింది. గతేడాది కూడా పంజాబ్ చివరి స్థానంతోనే ఐపీఎల్ సీజన్ ను ముగించడం తెలిసిందే.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement